HBD Balakrishna: ఇట్స్ అఫీషియల్.. బాలయ్యను సెట్స్‏లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నానంటున్న డైరెక్టర్.. టీజర్ అదుర్స్..

Balakrishna: నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ సర్‏ఫ్రైజ్ వచ్చేసింది. గురువారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించబోయే

HBD Balakrishna: ఇట్స్ అఫీషియల్.. బాలయ్యను సెట్స్‏లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నానంటున్న డైరెక్టర్.. టీజర్ అదుర్స్..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 10, 2021 | 11:03 AM

Balakrishna: నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ సర్‏ఫ్రైజ్ వచ్చేసింది. గురువారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించబోయే 107వ సినిమా పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. బాలకృష్ణ తదుపరి చిత్రం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ బ్యానర్ పై నిర్మించనుంది. ఇందుకు సంబంధించి పోస్టర్‏తో పాటు ఇంట్రడ్యూసింగ్ వీడియోను దర్శకుడు గోపిచంద్ మలినేని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.

“హ్యాపీ బర్త్ డే బాలయ్య బాబు గారు.. మిమ్మల్ని సెట్‏లో కలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను”.. అంటూ ట్వీట్ చేసాడు గోపిచంద్ మలినేని. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిచనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల రవితేజ నటించిన క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు గోపిచంద్. ఆ తర్వాత బాలయ్య కోసం ఓ స్క్రీప్ట్ సిద్ధం చేసుకున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ.. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ట్వీట్..

వీడియో..

Also Read: Ghantasala Ratna Kumar: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూత..

తమిళ స్టార్ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. ఆ డైరెక్టర్‏కు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నిర్మాణ సంస్థ ?

Kajal Aggarwal: మరోసారి ఆ స్టార్ హీరో సరసన కాజల్.. ‘ఖైదీ’ భార్యగా నటించనున్న అందాల చందమామ..

Vishal: డాక్యుమెంట్స్ వివాదం.. ఆ బడా ప్రొడ్యూసర్ పై హీరో విశాల్ ఫిర్యాదు.. ట్వీట్ వైరల్..