AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arha: చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్న బన్నీ డాటర్.. అల్లు అర్హ క్యూట్ వీడియో వైరల్..

Allu Arha: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ముద్దు మద్దు మాటలు..

Allu Arha: చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్న బన్నీ డాటర్.. అల్లు అర్హ క్యూట్ వీడియో వైరల్..
Allu Arha
Rajitha Chanti
|

Updated on: Jun 10, 2021 | 11:33 AM

Share

Allu Arha: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ముద్దు మద్దు మాటలు.. అల్లరి చెష్టలతో ఎంతో మంది అభిమానులకు సొంతం చేసుకుంది అర్హ. స్టైలీష్ స్టార్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి.. పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా స్నేహరెడ్డి అర్హకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేసుకున్నారు.

ఆ వీడియోలో అర్హ.. చెస్ ఆడాటానికి సిద్ధం అవుతూ.. పావులను సెట్ చేసుకుంటూ కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ అర్హ చెస్ కోసం పావులను సిద్ధం చేయడం చూసి ఆమెను అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ డైరెక్షన్‏లో పుష్ప మూవీ చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ కరోనా భారిన పడడంతో ఈ సినిమా షూటింగ్‏కు బ్రేక్ పడింది. ఇక కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.

ట్వీట్..

Also Read:  HBD Balakrishna: ఇట్స్ అఫీషియల్.. బాలయ్యను సెట్స్‏లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నానంటున్న డైరెక్టర్.. టీజర్ అదుర్స్..

Covaxin phase 4: కోవాగ్జిన్ వ్యాక్సిన్ 4 దశ ట్రయల్ కి సిద్ధపడిన భారత్ బయోటెక్ కంపెనీ.. త్వరలో మూడో ట్రయల్ ఫలితాల ప్రకటన..

Telangana High Court: ఎట్టకేలకు ఫలించిన సర్కార్ ప్రయత్నాలు.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు..!

Joe Biden: ప్రపంచానికి ఫైజ‌ర్ వ్యాక్సిన్లు.. మిత్ర దేశాలకు అమెరికా భరోసా.. జీ7 శిఖరాగ్ర సదస్సులో బైడెన్ కీలక ప్రకటన?