Viral Video: హెల్మెట్ ను ఆహారం అనుకుని తినడానికి ప్రయత్నించిన ఏనుగు.,. వీడియో వైరల్

Viral Video: ఒక ఏనుగుకు పాపం ఆకలివేసినట్లుంది.. ఆలా వెళ్తుంటే.. దానికి దారిలో ఆగి ఉన్న ఓ బైక్ కనిపించింది, ఆ బైక్ మీద ఓ హెల్మెట్ కూడా ఉంది. ఆ హెల్మెట్ ఏనుగు కంట్లో..

Viral Video: హెల్మెట్ ను ఆహారం అనుకుని తినడానికి ప్రయత్నించిన ఏనుగు.,. వీడియో వైరల్
Vairal Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2021 | 12:31 PM

Viral Video: ఒక ఏనుగుకు పాపం ఆకలివేసినట్లుంది.. ఆలా వెళ్తుంటే.. దానికి దారిలో ఆగి ఉన్న ఓ బైక్ కనిపించింది, ఆ బైక్ మీద ఓ హెల్మెట్ కూడా ఉంది. ఆ హెల్మెట్ ఏనుగు కంట్లో పడింది. ఆ ఏనుగు అదిఏదో తినే పదార్ధం అన్నట్లుంది.. వెంటనే ఆ హెల్మెట్ ను తన తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుని గుటుక్కు మనిపించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

గౌహతిలోని నారంగి సమీపంలోని సత్గావ్ ఆర్మీ క్యాంప్‌లో వద్ద ఓ ఏనుగు హెల్మెట్ ను తినడానికి ప్రయత్నించిన వింత సంఘటన జరిగింది. ఓ ఏనుగు ఆర్మీ క్యాంప్‌లో ఆగి ఉన్న బైక్‌ను సమీపించి, రియర్ వ్యూ మిర్రర్ ఉన్న ల్మెట్‌ను తన తొండంతో లాగింది. తరువాత, ఆ హెల్మెట్ ను నోటిలో ఉంచుకుని బైక్ కు దూరంగా నడుచుకుంటూ వెళ్లి తినడానికి ట్రై చేసింది. అయితే వాహనం యజమాని తాను హెల్మెట్ పోగొట్టుకున్నా ఇప్పుడు ఎలా వెళ్ళను అంటున్నది వీడియో రికార్డ్ అయ్యింది.

అయితే ఇక్కడికి అమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఏనుగులు ఆహారం కోసం వెదుకుతూ.. వస్తాయని అధికారులు చెప్పారు. ఈ ఏనుగు కూడా అలా అమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి బయటకు వచ్చి ఆర్మీ క్యాంప్ లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆకలి తీర్చుకోవడానికి తినే వస్తువుగా భావించి హెల్మెట్ ను తీసుకుంది. ఈ సంఘటన హెల్మెట్ యజమాని తన ఫోన్‌లో బంధించించాడు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Also Read: Karthika Deepam: మోనిత నిజ స్వరూపం ఇప్పటికైనా నీకు తెలిసిందా అంటూ కార్తీక్ ని ప్రశ్నించిన సౌందర్య