Mona Lisa: ప్రఖ్యాత ‘మోనాలిసా’ పెయింటింగ్‌పై కేక్ విసిరిన వ్యక్తి.. సీన్ కట్ చేస్తే..

Mona Lisa: సుప్రసిద్ధ కళాఖండం మోనాలిసా పెయింటింగ్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడో పర్యావరణవాది. సెక్యూరిటీ గార్డ్స్‌ అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Mona Lisa: ప్రఖ్యాత ‘మోనాలిసా’ పెయింటింగ్‌పై కేక్ విసిరిన వ్యక్తి.. సీన్ కట్ చేస్తే..
Mona Lisa
Follow us
Shiva Prajapati

|

Updated on: May 31, 2022 | 9:44 AM

Mona Lisa: సుప్రసిద్ధ కళాఖండం మోనాలిసా పెయింటింగ్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడో పర్యావరణవాది. సెక్యూరిటీ గార్డ్స్‌ అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాల్లోకెళితే.. ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా పెయింటింగ్‌ మీద ఓ యువకుడు దాడికి పాల్పడటం కలకలం రేపింది. పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఉన్న ఈ పెయింటింగ్‌ మీదకు వీల్‌ ఛైర్‌లో వృద్ధురాలి గెటప్‌లో వచ్చిన ఈ వ్యక్తి దూసుకువెళ్లాడు. తన చేతిలోని కేక్‌ను మొనాలిసా పెయింటింగ్‌ మీద విసిరేశాడు. అంతటితో ఆగకుండా పెయింటింగ్‌ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న కళాప్రియులు, సందర్శకులు షాక్‌కు గురయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఓ పర్యావరణవాది అని చెబుతున్నాడు. ఈ పని ఎందుకు చేశాడనే విషయంలో క్లారిటీ లేదు. కొందరు భూమిని నాశనం చేస్తున్నారంటూ నినాదాలు చేశాడు.. దాడి జరిగిన వెంటనే మ్యూజియం సిబ్బంది పెయింటింగ్‌ను క్లీన్‌ చేశారు.

కాగా, మొనాలిసా పెయింటింగ్‌పై దాడులు కొత్తేం కాదు. 1956లో ఓ వ్యక్తి యాసిడ్‌ దాడి చేయడంతో ఈ పెయింటింగ్‌ కొంత దెబ్బతిన్నది. అప్పటి నుంచి బులెట్‌ఫ్రూప్‌ గ్లాస్‌లో భద్రపరుస్తున్నారు. లియోనార్డో డావిన్సీ 1503 నుంచి 1506 మధ్యకాలంలో మొనాసిసా పెయింటింగ్‌ గీశాడు. మొనాలిసా నవ్వులోని రహస్యం ఏమిటి అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్‌ ఇది. 1962లో మొనాలిసా పెయింటింగ్‌ను 100 మిలియన్‌ డాలర్లకు ఇన్స్యూరెన్స్‌ చేశారు.

ఇవి కూడా చదవండి