Ireland Man Chris: 300 ఇంటర్వ్యూలకు వెళ్లిన నిరుద్యోగి.. ఉద్యోగం ఇవ్వమంటూ 40వేలు ఖర్చు చేసి బ్యానర్స్ ఏర్పాటు.. ఎక్కడంటే..
Ireland Man Chris: పదమూడేళ్ల క్రితం వచ్చిన రవితేజ సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమా గుర్తుందా.. అందులో హీరో రవితేజ అండ్ కో.. తాము నిరుద్యోగులమని.. ఎవరైనా మీకు తెలిసిన..
Ireland Man Chris: పదమూడేళ్ల క్రితం వచ్చిన రవితేజ సినిమా ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ సినిమా గుర్తుందా.. అందులో హీరో రవితేజ అండ్ కో.. తాము నిరుద్యోగులమని.. ఎవరైనా మీకు తెలిసిన చోట చిన్న ఉద్యోగమైనా ఇప్పించండి అంటూ పాంప్లెట్స్ పంచిపెడతారు. ఇప్పుడు ఆ సీన్ ను గుర్తు చేస్తూ ఓ నిరుద్యోగి.. తనకు ఉద్యోగం కావాలని.. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను.. ఇక నేను ఉద్యోగం కోసం ఆఫీసులకు తిరగలేను.. దయచేసి నా క్వాలిఫికేషన్ కు తగిన ఉద్యోగం ఎవరైనా ఇవ్వండి అంటూ పాంప్లెట్ కాదు ఏకంగా పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్లు వేయించాడు. దీనికి ఆ నిరుద్యోగి భారీగానే ఖర్చు పెట్టాడు కూడా .. కాకపోతే ఇది మనదేశంలో కాదు.. ఐర్లాండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర ఐర్లాండ్ కి చెందిన ‘క్రిస్’ అనే 24 ఏళ్ల యువకుడు 2019 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 2019 నుంచి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ కాల్లరిగేలా తిరిగాడు. ఏ రేంజ్ లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసాడు అంటే ఒక వారంలో ఏకంగా 300 సార్లు ఇంటర్వ్యూ లకు హాజరయ్యాడు. అయితే ఎక్కడా ఉద్యోగం దొరకలేదు.. అన్ని ఇంటర్వ్యూ ల్లోనూ క్రిస్ కు ఉద్యోగం ఇవ్వడానికి సదరు కంపీనీలు నిరాకరించాయి.
దీంతో ‘క్రిస్’ ఉద్యోగం కోసం ఏమిచేయాలా అని ఆలోచించడం మొదలు పెట్టాడు. అతనికి వెంటనే సోషల్ మీడియా మేనేజర్ గా పనిచేస్తున్న సోదరి గుర్తుకు వచ్చింది. ప్రకటన ప్రచారం కోసం బిల్ బోర్డులను ఇన్స్టాల్ చేసే పనిచేస్తున్న సోదరిని చూసిన క్రిస్ కు ఒక ఐడియా తట్టింది. వెంటనే కార్యాచరణలో పెట్టాడు. తనకు ఉద్యోగం ఇవ్వమని హోర్డింగ్లు పెట్టాలనుకున్నాడు. డిజైనింగ్, పేపర్ వర్క్ చేసి పూర్తి చేసి .. మళ్ళీ మళ్ళీ ఉద్యోగం కోసం ఆఫీసుల చూట్టూ తిరగకుండా నగరం అంతా హోర్డింగ్లు ఏర్పాటు చేశాడు. ఇలా చేయడానికి క్రిస్ ఇప్పటి వరకూ మన కరెన్సీలో రూ.40 వేలు ఖర్చు చేశాడు. తన ఫొటోతో సహా యాడ్ ఇచ్చాడు. అందులో తన చదువు, స్కిల్స్ కి సంబంధించిన వివరాలను ఉంచాడు. దయచేసి నన్ను నియమించుకోండి అని హోర్డింగ్ లో రాసాడు. ఇలా హోర్డింగ్స్ పెట్టి.. ఐదు రోజులు కావస్తున్నా ఇప్పటికీ క్రిస్ కు ఉద్యోగం రాలేదు.
Also Read : Viral Video: నీటి ప్రాముఖ్యతను అర్ధం చేసుకున్న ఏనుగు.. చుక్కనీరు వృధాకాకుండా.. దాహం తీర్చుకున్న తీరు..
ఆర్మీ శిక్షణలో భగవద్గీత, కౌటిల్యుడి అర్ధశాస్త్రం.. సీడీఎం ప్రతిపాదనపై కస్సుమంటున్న కాంగ్రెస్ నేతలు..