Viral Video: నీటి ప్రాముఖ్యతను అర్ధం చేసుకున్న ఏనుగు.. చుక్కనీరు వృధాకాకుండా.. దాహం తీర్చుకున్న తీరు..

Viral Video: కుక్క పిల్లి, ఏనుగు వంటివి ఏ పనులు చేసినా ముద్దుగా అనిపిస్తాయి. మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తూ.. సంతోషం కలిగిస్తాయి. ఇక ముఖ్యంగా ఏనుగులు చేసే పనులైతే పిల్లలనే కాదు.. పెద్దలను..

Viral Video: నీటి ప్రాముఖ్యతను అర్ధం చేసుకున్న ఏనుగు.. చుక్కనీరు వృధాకాకుండా.. దాహం తీర్చుకున్న తీరు..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 04, 2021 | 12:54 PM

Viral Video: కుక్క పిల్లి, ఏనుగు వంటివి ఏ పనులు చేసినా ముద్దుగా అనిపిస్తాయి. మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తూ.. సంతోషం కలిగిస్తాయి. ఇక ముఖ్యంగా ఏనుగులు చేసే పనులైతే పిల్లలనే కాదు.. పెద్దలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే సర్కస్ లో ఏనుగులు సైకిల్ తొక్కినా, బంతి ఆట ఆడినా ఈలలు వేస్తూ మరి ఎంజాయ్ చేస్తారు. మరి అలాంటి ఏనుగు నీటి కోసం ఓ బోరింగ్ పైప్ ను కొట్టడమే కాదు.. తనకు ఎంత నీరు కావాలో అంత మాత్రమే నీరు వచ్చే వరకూ ఆ పైప్ ను కొట్టి.. నీరు వృద్ధా కాకుండా నడుచుకుంది. ఇంకేముందు ఆ వీడియో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ వద్దకు చేరుకుంది. వీడియో అధికారిక ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఏనుగుకు కూడా నీటి ప్రాముఖ్యత తెలిసింది. జలవనరులను వృధా చేయకుండా నడుచుకుంది. అనే క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అవును నీరు అవసరం.. దాని సంరక్షణ మనందరికీ తెలుసు. వనరులను వృధా చేస్తే భావితరాలు నీటి చుక్క కోసం ఎంతో కష్టపడాలని.. దేశాలు నీటి కోసం యుద్ధం చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు నాని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. నీరుని వృద్ధా చేయవద్దని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏనుగు దాహాం తీర్చుకోవడానికి నీటి బోరింగ్ ను ఉపయోగించిన తీరు. నీటిని వృధా చేయకుండా ఏనుగు సంతోషంగా తన దాహం తీర్చుకున్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది.

“ఏనుగు కూడా ప్రతి నీటి చుక్క  ప్రాముఖ్యతను అర్థం చేసుకుంది. సహజ వనరుల విలువను ప్రజలు ఎందుకు అర్థం చేసుకోరు.. రండి .. అందరం కలిసి ఈ ఏనుగు నుండి నీటి సంరక్షణ గురించి తెలుసుకుందాం, ”అంటూ అధికారులు పిలుపునిచ్చారు.

Also Read:    ఎవరైనా మోసం చేస్తుంటే దానిని సమయస్పూర్తితో ఎలా ఎదుర్కోవాలో చెప్పిన తెలివైన అమ్మాయి కథ..

Ice Cream Taster: ఐస్‌క్రీమ్ తిని టేస్ట్ చెప్పడానికి ఇప్పటికీ కోట్లను తీసుకుంటున్న వృద్ధుడు.. టేస్టీ‌‌బడ్స్‌కు మిలియన్ డాలర్ల భీమా..