Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఐఫోన్‌తో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొడుకు… ఆయన తండ్రి రెస్పాన్స్ వింటే మీరు షాకవుతారు

తండ్రి ఎమ్మెల్యే అన్న బలుపో, లేక కుప్పల కొద్దీ డబ్బు ఉందని గర్వమో ఏమో తెలియదు కానీ... కర్ణాటకలోని ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఐఫోన్‌తో...

Viral Video: ఐఫోన్‌తో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొడుకు... ఆయన తండ్రి రెస్పాన్స్ వింటే మీరు షాకవుతారు
Mla Son Cake Cutting
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 04, 2021 | 1:49 PM

తండ్రి ఎమ్మెల్యే అన్న బలుపో, లేక కుప్పల కొద్దీ డబ్బు ఉందని గర్వమో ఏమో తెలియదు కానీ… కర్ణాటకలోని ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌లను కట్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. కనకగిరి ఎమ్మెల్యే బసవరాజ్‌ దడేసుగూర్‌ కొడుకు ఇటీవల పుట్టన రోజు వేడుక జరుపుకున్నాడు. అసలే ఎమ్మెల్యే కొడుకు. చుట్టూ అనుచరులు, ఫాలోవర్స్ ఉంటారు. రేంజ్ ఏ మాత్రం తగ్గకూడదు. దీంతో వేడుకలో భారీ కేక్‌లను తన ఐఫోన్‌తో కట్‌ చేశాడు. కాగా అతడు గంటకొక కార్‌లో కూడా కనిపించాడు.  బర్త్ డే రోజున బళ్లారి జిల్లా హోసపేటలో వేడుక జరుపుకోవడానికి తన ఫ్రెండ్స్‌తో కలిసి BMWలో చేరుకున్నాడు. అంతకు ముందు ఆడి కార్‌లో బళ్ళారిలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్ళి టిఫిన్‌ తింటూ కనిపించాడు.

కాగా తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మొత్తం​ 8 కేకులను ఐఫోన్‌తో కట్‌ చేశాడు ఈ ఎమ్మెల్యే సన్. అయితే దీనిపై అతడి తండ్రి ఎమ్మెల్యే బసవరాజ్‌ రెస్పాండ్ అయ్యారు.. ‘‘నా కొడుకు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బుతో కొన్న ఐఫోన్‌తో కేక్‌ కట్‌ చేశాడు. ఇందులో పెద్ద తప్పేముంది? కరోనా కారణంగా చేతులకు బదులు ఐఫోన్‌ ఉపయోగించాడు’’ అంటూ వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ నెటిజన్లు మాత్రం కుర్రాడిని, ఆయన బాబు గారిని ఓ రేంజ్‌లో విమర్శిస్తున్నారు. . ‘‘2018 ఎన్నికలకు ముందు ఎన్నికల ఖర్చుల కోసం ఆయన నియోజకవర్గంలో ప్రజలు చందాలు వేసుకుని క్రౌడ్‌సోర్సింగ్‌ ద్వారా గెలిపించారు. ఆ విధంగా గెలిచిన ఈ ఎమ్మెల్యే ప్రస్తుతం ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈ డబ్బు ఎలా వచ్చింది?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దారితప్పిన కొడుకును గద్దించి దారిలోకి తెచ్చుకోకుండా.. ఇలా వెనకేసుకు రావడం ఏంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు. కాగా ఈ టాపిక్ కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read:  హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

బిగ్‏బాస్ 5 షురూ.. హౌస్‏లోకి కంటెస్టెంట్స్.. ఫైనల్ లిస్ట్ ఇదే..