Hero Krishnudu: హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

టాలీవుడ్ నటుడు A.కృష్ణం అలియాస్ హీరో కృష్ణుడు అరెస్ట్ అయ్యాడు. శుక్రవారం అర్థరాత్రి మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో

Hero Krishnudu: హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు
Hero Krishnudu
Follow us

|

Updated on: Sep 04, 2021 | 12:06 PM

సినీ నటుడు కృష్ణుడు అరెస్ట్ అయ్యాడు. పేకాట కేసు లో హీరో కృష్ణుడు అరెస్ట్ అయినట్లు సమాచారం అందుతోంది. హీరో కృష్ణుడు తో పాటు మరో ఎనిమిది కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని శిల్పాపార్క్ విల్లా లో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు నటుడు కృష్ణుడుని అదుపులోకి తీసుకున్నారు. నటుడు కృష్ణుడు తో పాటు ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు.. మియపూర్ పోలీసులు చాలా ప్లానింగ్ గా ఎటాక్ చేసి ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు.  వారివద్ద నుండి లక్షా 97 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 8 సెల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు.  ఈ విషయాన్ని పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. వారందరినీ మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి కోర్టుకు తరలించి అక్కడి నుండి రిమాండ్‌కు తరలించారు.  కాగా నటుడు  కృష్ణుడు.. తెలుగు చిత్ర పరిశ్రమలో.. కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలేజ్‌లో వినాయకుడు, హ్యాపీడేస్, యువత, షాక్, ఆర్య2, స్నేహగీతం, జ్యోతి లక్ష్మి తదితర సినిమాల్లో నటించాడు. కాగా ఆయన ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు.

గతంలో ఓ రేప్ కేసులో విషయంలో ఇబ్బందులు

గతంలో తనను 139 మంది గత ఎనిమిదేళ్లుగా 5000 సార్లుకు పైగా రేప్ చేశారంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువతి హైదరబాబ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అదంతా ఫేక్ అని తేలింది. అయితే ఈ కేసులో కృష్ణుడు పేరు కూడా ఉంది. ఆసమయంలో కృష్ణుడు అప్పట్లో ఈ ఇష్యూపై సందించారు. ఆయన మాట్లాడుతూ.. “నాకు ఈ న్యూస్ తెలియగానే షాక్ అయ్యాను. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత హీరోగా, ఆర్టిస్ట్‌ చాలామందితో కలిసి పనిచేశాను. ఎప్పుడూ కూడా నాపై ఆరోపణలు లేవు. నాకు మందు అలవాటు లేదు.. సిగరెట్ అలవాటు లేదు. అలాంటి నాపై రేప్ ఆరోపణలు రావడం షాక్‌లోకి వెళిపోయా. ఈ విషయం మొదట నా భార్యకి చెప్పాను. నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడంతో నా భార్య.. నీ గురించి నాకు తెలుసు అని చెప్పింది. నేను అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నా.. ఇక్కడ చాలామంది ఉంటారు. ఊర్లో అమ్మ ఒక్కరే ఉన్నారు. వాళ్లందరిపై ఈ ఆరోపణలు ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయని ఆలోచించాలి. ఒకరిపై ఆరోపణలు చేసేటప్పుడు ఇంకే ఆలోచించరా?? మా ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు.. నాకు కూతురు ఉంది.. ఆధారాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసేసి.. లబ్ధి పొందాలనుకుంటే ఈ ప్రభావం రేపటి రోజున చాలామందిపై పడుతుంది” అని కృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.? ఆమె హెయిర్ చూశాక కూడా గుర్తు రావట్లేదా

గంటా తులసి.. స్కెచ్‌ వేస్తే ఖేల్ ఖతమే.. ఆటో ప్రయాణికులే టార్గెట్.. ఇప్పటికే 20 కేసులు