AP Crime News: గంటా తులసి.. స్కెచ్ వేస్తే ఖేల్ ఖతమే.. ఆటో ప్రయాణికులే టార్గెట్.. ఇప్పటికే 20 కేసులు
202 కాలనీ నుంచి కొత్తవలసమీదుగా కొంతమందితో విశాఖ జిల్లాలో నిత్యం ఎంటరైపోతూ ఉంటుంది ఈ కి'లేడీ'. కనిపించిన వారిని మాయచేసి మభ్యపెట్టి....
ఆమె మామూలు లేడీ కాదు.. మాయలేడీ..! క్షణాల్లో మాయచేసి దోచుకునే ఖతర్నాక్ కిలేడీ..! జైలుకెళ్ళినా.. శిక్షపడినా.. ఏమాత్రం బుద్ధి మారకుండా తన చోరకళకు పదునుపెడుతూనే ఉంది. తాజాగా మళ్ళీ ఓ కేసులో అరెస్టై కటకటాలపాలైంది. పేరు గంటా తులసి. ఊరు.. విజయనగరం జిల్లా కొత్తవలసలోని 202 కాలనీ. వృత్తి చోరీలు.! ఒక్కోసారి సింగిల్‌గానూ.. మరికొన్ని సార్లు ఓ గ్రూప్‌గాను వెళ్తుంది. స్కెచ్ వేసిందంటే.. పని అయిపోయినట్టే..! ఒంటరి మహిళలు, అమాయకులే ఆమె టార్గెట్.
202 కాలనీ నుంచి కొత్తవలసమీదుగా కొంతమందితో విశాఖ జిల్లాలో నిత్యం ఎంటరైపోతూ ఉంటుంది ఈ కి’లేడీ’. కనిపించిన వారిని మాయచేసి మభ్యపెట్టి పాకెట్ గుళ్ల చేసేస్తోంది. ఒక్కో సమయంలో ఒంటరిగానూ.. కొన్ని సందర్భాల్లో తన బ్యాచ్‌తో ఈ నేరాలకు చేస్తూ ఉంటుంది. ఈమె టార్గెంట్ చేస్తోంది ఓన్లీ ప్రయాణికులకే..! సింగిల్‌గా వెళ్ళినప్పుడు ఓ ప్రయాణికురాలిగా ఆటోలో ఎక్కుతుంది. పెందుర్తినుంచి గోపాలపట్నం వరకు నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటుంది. తన పక్కనే ఎవరైనా ఎక్కి కూర్చుకున్నారో.. వారి జేబు గుళ్లైపోయినట్టే..! ఇక.. మరికొన్ని సందర్భాల్లో అయితే.. ఎవరికీ అనుమానం రాకుండా ఓ బ్యాచ్‌నే సెట్ చేస్తుంది. తానొక ప్రయాణికురాలిగా నటిస్తూ.. ఆటో డ్రైవర్‌తో పాటు.. మరో మహిళను కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. అంతేకాదు… కొన్ని సందర్భాల్లో ఓ చిన్న బేబీని కూడా తమతో పాటు తీసుకెళ్తుంది. కొంతదూరం వెళ్ళాక.. వీరి స్కెచ్ మొదలవుతుంది. బ్యాచ్‌కు గంటా తులసి టోటల్ డైరెక్షన్ ఇస్తుంది. ప్లాన్‌లో భాగంగా ఒంటరి మహిళలనే ఈ బ్యాచ్ టార్గెట్ చేస్తుంది. తులసి చెప్పిన డైరెక్షన్‌తో ఆటో డ్రైవర్.. రోడ్డుపై ఆటోలకోసం వేచిచూసే సింగిల్ లేడీస్ దగ్గరకు తీసుకెళ్లి ఆపుతాడు. ఆమె ఎక్కడికంటే అక్కడికి కాస్త తక్కువకైనా బేరం ఒప్పించి ఎక్కించేస్తారు. అప్పుడు వీరి పని మొదలవుతుంది. కొంతదూరం వెళ్ళాక.. మరో మహిళ ఒడిలో ఉన్న బేబీకి వీళ్ళే గిల్లుతారు. బేబీ ఏడ్చిన వెంటనే.. వారితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు ఆ బేబీ వైపు డైవర్ట్ అవుతోంది. ఇంతలో.. మరోవైపున్న గంటా తులసి.. ఆ ప్రయాణికులరాలు బ్యాగును గుళ్ల చేసేస్తోంది.
కొన్ని సందర్భాల్లో సింగిల్‌గా కూడా అఫెన్స్‌లు చేస్తూ ఉంటుంది ఈ గంటా తులసి. తాజాగా గత నెల 26న చినముషిడివాడకు చెందిన కె దేవి అనే మహిళ.. నక్లెస్ మరమ్మత్తులు చేయించుకుని తిరిగి వెళ్తోంది. గోపాలపట్నం నుంచి పెందుర్తి వెళ్లేందుకు ఆటో ఎక్కింది దేవి. పెందుర్తి ఆటో దిగిన తరువాత పదిహేను గ్రాముల బంగారు నెక్లెస్ మాయమైనట్టు గుర్తించి ఉలిక్కిపడింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇటువంటి నేరాలకు పాల్పడే నేరస్థులపై కన్నేశారు. వారిని వెరిఫై చేసి.. దేవి నక్లెస్ కాజేసింది గంటా తులసేరని నిర్ధారించారు. తులసిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కునెట్టారు క్రైం పోలీసులు.
గంటా తులసి.. గతంలోనూ దాదాపు 20కి పైగా కేసుల్లో నిందితురాలుగా ఉంది. చాలా సార్లు జైలుకెళ్ళింది. కొన్ని కేసుల్లో ఆమెకు శిక్షకూడా ఖరారైంది. అయినా.. ఆమె తన బుద్ధి మార్చుకోలేదు. మళ్ళీ ఇప్పుడు చోరీ కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలైందని క్రైం డీసీపీ సురేష్‌బాబు తెలిపారు. అయితే.. ఈసారి మాత్రం పోలీసులు ఈమెపై డీసీ షీట్ ఓపెన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
(ఖాజా, టీవీ9 తెలుగు, వైజాగ్)
Also Read: ‘జగనన్న విద్యా దీవెన’పై హైకోర్టు కీలక తీర్పు… ఇకపై డబ్బు వారి అకౌంట్లలోకే
సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు పూర్తి.. ప్రేయసి కన్నీళ్లు.. గుండె తరుక్కుపోయే సీన్..