Sidharth Shukla: సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు పూర్తి.. ప్రేయసి కన్నీళ్లు… గుండె తరుక్కుపోయే సీన్..

‘బిగ్‌బాస్‌-13’ విజేత సిద్దార్థ్‌ శుక్లా గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Sidharth Shukla: సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు పూర్తి.. ప్రేయసి కన్నీళ్లు... గుండె తరుక్కుపోయే సీన్..
Shehnaaz Gill Cries
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 03, 2021 | 6:40 PM

సిద్దార్థ్ శుక్లా(40) ఆకస్మిక మరణం అతని సన్నిహితులను, అభిమానులకు విషాదంలోకి నెట్టింది. తాజాగా ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం ముంబయిలోని ఓషివారా శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు.. సిద్దార్థ్​కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ అంత్యక్రియల్లోనే పాల్గొన్న సిద్దార్థ్​ ప్రేయసి షెహనాజ్​ గిల్ కన్నీటి పర్యమంతమైంది. ఈ సన్నివేశం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆమె ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారింది. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ ఫొటోను చూసి పలువురు అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

అయితే గురువారం రాత్రి ముంబయి ఆస్పత్రిలో సిద్దార్థ్​ డెడ్‌బాడీకి శవ పంచనామా నిర్వహించారు. డాక్టర్ల సమక్షంలో పోలీస్‌ అధికారులు పోస్ట్‌మార్టంను షూట్ చేశారు. అనంతరం శవపంచనామా నివేదికను పోలీసులకు అందించారు. ఈ రిపోర్ట్ ప్రకారం సిద్దార్థ్‌ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గుండెపోటుతోనే మృతి చెందారని అందరూ భావిస్తున్నారు. ‘బాలికావధు’  సీరియల్‌తో సిద్దార్థ్‌ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోలో పాల్గొని విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్నారు.

‘బిగ్‌బాస్‌’ రియాల్టీషోలో ఉన్న సమయంలో సిద్దార్థ్‌ శుక్లాకు షెహనాజ్‌ గిల్‌తో పరిచయం ఏర్పడింది. షోలో ఉన్నప్పుడే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వీరి మధ్య ఉన్న బాండింగ్ చూసి ఈ జంటకు ఓ రేంజ్‌లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. షో నుంచి బయటకు వచ్చాక కూడా వీరిద్దరూ కలిసి పలు షోల్లో సందడి చేశారు. దీంతో సిద్దార్థ్‌-షెహనాజ్‌ లవ్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సిద్దార్థ్‌ ఆకస్మిక మరణంతో షెహనాజ్‌ షాక్‌కు గురైందని.. ఎవ్వరితోనూ మాట్లాడాలనుకోవడం లేదని.. సెల్‌ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేసేసిందని ఆమె స్నేహితులు, తోటి నటీనటులు చెబుతున్నారు.

Also Read: చిత్తూరు జిల్లాలో సంచలనం… 74 మంది వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా

విశాఖ వీధుల్లో పందుల పందేలు.. ఊలలు, అరుపులు.. స్థానికులు బెంబేలు