Tollywood Drugs Case: ఆరు గంటలుగా సాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ విచారణ.. కొన్ని అనుమానిత లావాదేవీలపై ఈడీ ఆరా
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఈడీ అధికారులు ఆరు గంటలుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విచారిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో..
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఈడీ అధికారులు ఆరు గంటలుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను విచారిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో రకుల్‌ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రకుల్ బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తున్నారు. రకుల్ కు హైదరాబాద్, ఢిల్లీ, బాంబే లో అకౌంట్స్ ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు ఈ మూడు బ్యాంక్ అకౌంట్లు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లో రకుల్ కి ఫిట్నెస్ సెంటర్.. సెంటర్ బ్యాంక్ ఖాతాలను సేకరించి ఆరా తీస్తున్నారు. అంతేకాదు రకుల్ ఖాతాల నుంచి పెద్దమొత్తంలో ఎఫ్ క్లబ్ మేనేజర్ కి డబ్బులు బదలయించినట్లు గుర్తించారు. కెల్విన్ కి రకుల్ చాలా సార్లు డబ్బులు పంపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మరికొన్ని అనుమానిత లావా దేవిలపై ఈడీ ఆరా తీస్తుంది. ఇక రకుల్ ఆడిటర్ తో పాటు రకుల్ ని కలిపి విచారిస్తున్నారు. కెల్విన్ ఎఫ్ క్లబ్ మేనేజర్ లతో చాటింగ్ వివరాలు సేకరిస్తున్నారు.
నిజానికి రకుల్ ప్రీతి సెప్టెంబర్ 6న విచారణకు హజరుకావాల్సి ఉంది.. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈడీ సూచించిన తేదిన హజరు కాలేనని రకుల్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల ముందుగానే నేడు విచారణకు హాజరవుతానని రకుల్.. అభ్యర్థనకు ఈడీ అధికారులు అంగీకరించడంతో.. ఈరోజు రకుల్ విచారణకు హాజరయ్యింది. ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్‌ను 10 గంటలు, చార్మిని ఎనిమిది గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే.
Also Read: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..