Monsoon Health Tips: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి

Monsoon Health Tips: ఓ వైపు కరోనా వైరస్ థర్డ్ వేవ్ రానున్నదనే హెచ్చరికలు.. మరోవైపు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు.. దీంతో ఏ చిన్న రోగం వచ్చినా ప్రజలు భయభ్రాంతులకు..

Monsoon Health Tips: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి
Monsoon Season
Follow us
Surya Kala

|

Updated on: Sep 03, 2021 | 3:59 PM

Monsoon Health Tips: ఓ వైపు కరోనా వైరస్ థర్డ్ వేవ్ రానున్నదనే హెచ్చరికలు.. మరోవైపు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు.. దీంతో ఏ చిన్న రోగం వచ్చినా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే వర్షాకాలంలో ఎక్కువమంది అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఎందుకంటే చల్లటి వాతావరణం.. అప్పుడప్పుడు అనుకోకుండా కురిసే వర్షాలకు తడిస్తే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. ఇలాంటి సమయంలో వచ్చే వ్యాధులకు ఇంగ్లిష్ మెడిసిన్ కంటే ఇంట్లో ఉండే వాటితో సహజ సిద్ధంగా నయం చేసుకోవచ్చు. ఇలా సహజమైన పద్దతులతో వ్యాధులను నయం చేసుకుంటే .. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.. ఇప్పుడు ఫ్లూ , జలుబు, కాళ్ళ పగుళ్లు వంటి అనేక సీజనల్ వ్యాధులను నయం చేయడానికి వంటింట్లో ఉండే వస్తువులతో సింపుల్ చిట్కాల గురించి తెలుసుకుందాం..

* ప్రతి భారతీయుల వంటింట్లో తప్పనిసరిగా ఉండే వస్తువు ‘పసుపు’. దీనిలో అనేక ఔషధ గుణాలున్నాయి. రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పసుపు ని పాలల్లో కలుపుని తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పసుపుని చర్మానికి రాసుకున్నా స్కిన్ వ్యాధులను నివారిస్తుంది. ఇక కళ్ళు పగుళ్లు ఏర్పడి ఇబ్బంది పడుతుంటే.. పసుపు ని రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

*పోపుల పెట్టెలో ఉండే మరో ఔషధం న‌ల్ల మిరియాలు. వీటిని ఆయుర్వేదంలో న‌ల్ల బంగారం అంటారు. అనేక పోష‌కాలు, ఔష‌ధ విలువ‌లు ఉన్నాయి. నల్ల మిరియాల్లో ఫాస్ఫ‌ర‌స్‌, మాంగ‌నీస్, కెరోటీన్, సెలీనియం, విట‌మిన్ కె త‌దిత‌ర పోష‌కాలు ఉన్నాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.  అందువ‌ల్ల న‌ల్ల మిరియాల‌ను వర్షాకాలంలో తినే ఆహారంలో భాగం చేసుకోమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

* పోపుల పెట్టె ఓ మెడికల్ షాపు.. ఇందులో ఉండే మరో అద్భుతమైన ఔషధం లవంగాలు. వీటిల్లో అద్భుత‌మైన, శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అందుకని రోగ నిరోధ‌క శ‌క్తి ని పెంచే గుణం వీటి సొంతం. జ‌లుబు, ద‌గ్గు, గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ల‌వంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఆక్సిడెంట్ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. కనుక లవంగాల టీని తరచుగా తీసుకుంటే జలుబు బారిన పడకుండా ఉండవచ్చు.

*మసాలా పదార్ధాల్లో ఒకరి దాల్చిన చెక్క. ఇది నోటి  సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా దంతాలు, చిగుళ్ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దాల్చిన చెక్క‌ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చే అవకాశం తక్కువ.

Also Read : Dog-Peddakarma: అనారోగ్యంతో మరణించిన పెంపుడు కుక్క.. మటన్ కూరతో ‘పెద్దకర్మ’ నిర్వహించిన యజమాని..