Dog-Peddakarma: అనారోగ్యంతో మరణించిన పెంపుడు కుక్క.. మటన్ కూరతో ‘పెద్దకర్మ’ నిర్వహించిన యజమాని

Dog-Peddakarma: కుక్క పెంపుడు జంతువుగా కాకుండా స్నేహితునిగా మారిన ఒకే ఒక జంతువు. తనకు అన్నం పెట్టేవారి మేలు కోసం ఎవరితోనైనా పోట్లాడే నైజం దీని సొంతం.. ఇక తనను పెంచిన..

Dog-Peddakarma: అనారోగ్యంతో మరణించిన పెంపుడు కుక్క.. మటన్ కూరతో 'పెద్దకర్మ' నిర్వహించిన యజమాని
Dog Pedakarma
Follow us

|

Updated on: Sep 03, 2021 | 3:35 PM

Dog-Peddakarma: కుక్క పెంపుడు జంతువుగా కాకుండా స్నేహితునిగా మారిన ఒకే ఒక జంతువు. తనకు అన్నం పెట్టేవారి మేలు కోసం ఎవరితోనైనా పోట్లాడే నైజం దీని సొంతం.. ఇక తనను పెంచిన యజమానికి అత్యంత విశ్వాస పాత్రంగా ఉండే కుక్కను అందంగా రెడీ చేసి సొంత పిల్లలతో సమానంగా చూసేవారు ఉన్నారు. ఇక కుక్కలకు అందాల పోటీలు, పుట్టినరోజులు ఘనంగా నిర్వహించడం సర్వసాధారణం.. మరికొందరు అయితే తమ పెంపుడు కుక్కలకు పిల్లలతో సమానంగా ఆస్తులు రాసిన వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే ఇప్పుడు తమ పెంపుడు కుక్క మరణాన్ని మనిషికి చేసినట్లు కర్మకాండలతో నిర్వహించిన ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం.. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాకేంద్రమైన జగిత్యాలలో విద్యానగర్‌లో నివాసం ఉండే కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సుమ దంపతులు ఆరేళ్ల కిందట ఓ శునకాన్ని పెంచుకోవడానికి ఇంటికి తెచ్చుకున్నారు. అప్పుడు దానికి ‘అఖిల’ అనే పేరు తమ ఇంటికి వచ్చిన తర్వాత దానిని మిల్కీ అని పిలుచుకుంటూ ప్రేమగా పెంచుకుంటున్నారు. తమ పిల్లలతో సమానంగా మిల్కీని చూసేవారు ఆ దంపతులు .. మిల్కీ అని పిలుచుకుంటూ ముద్దు చేసేవారు. శ్రీనివాస్ రెడీ, సుమ ఎక్కడికి వెళ్లినా పనిమీద వెళ్లినా, ఫంక్షన్లకు వెళ్లినా మిల్కీ తమ వెంట తీసుకుని వెళ్లేవారట. ఇంట్లో ఉంటె ఈ మిల్కీ ఇంట్లో ఉన్న వారి వెనుక వెనుక తిరుగుతూ తెగ సందడి చేసేది.

Dog Dasakarma

Dog Dasakarma

అయితే కొన్ని రోజులక్రితం మిల్కీ కి జబ్బు చేసింది. ఎన్ని మందులు వేసినా మిల్కీ ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంతలో హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కు శ్రీనివాస్ రెడ్డి దంపతులు హాజరుకావాల్సి ఉంది. దీంతో మిల్కీని కూడా తమతో పాటు హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు. హైదరాబాద్ లోనే ఆగస్ట్ 21 న మిల్కీ మరణించింది. జగిత్యాల వచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి, సుమ దంపతులు మిల్కీ కి మూడో రోజు, ఐదో రోజు కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 1న పెద్దకర్మ నిర్వహించారు. గ్రామస్థులను పిలిచి భోజనాలు కూడా పెట్టారు.

Also Read:

AP Weather Alert: బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం.. ఏపీలో రాగల 3 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం