AP Weather Alert: బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం.. ఏపీలో రాగల 3 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

Surya Kala

Surya Kala |

Updated on: Sep 03, 2021 | 3:05 PM

AP Weather Alert: గురువారం బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య  ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో..

AP Weather Alert: బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం.. ఏపీలో రాగల 3 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
Ap Weather

AP Weather Alert: గురువారం బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య  ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 1.5 కిమీ నుండి 4.5 కిమీ ఎత్తుల మధ్య కొనసాగుతుందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.  ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి  ఉంది. ఈరోజు షీర్ జోన్ 10°N అక్షాంశం వెంబడి సగటు సముద్రమట్టానికి 5.8 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తుల మధ్య ఏర్పడింది.  దీంతో ఈ నెల 6న ఉత్తర, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటాయని అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం:

*ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

*విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు, పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

*రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

*విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

*ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

*కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

*రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

*కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:

*ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

*కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

*రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

Also Read:   జనసేనానిపై, కార్యకర్తలపై మళ్ళీ సంచలన కామెంట్స్ చేసిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీను..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu