Fake challan Scam: అన్ని శాఖల్లోనూ అవినీతి.. ఏపీని కుదిపేస్తోన్న నకిలీ చలాన్ల కుంభకోణం

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Sep 03, 2021 | 2:22 PM

ఈ శాఖ ఆ శాఖ అని కాదు.. అన్ని శాఖల్లోనూ అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. లెటెస్ట్‌గా CFMS ఖాతాకు ఆలస్యంగా చలాన్లు చేరడంపై అనుమానాలు

Fake challan Scam: అన్ని శాఖల్లోనూ అవినీతి.. ఏపీని కుదిపేస్తోన్న నకిలీ చలాన్ల కుంభకోణం
Document Writers

Fake challan Scam: ఈ శాఖ ఆ శాఖ అని కాదు.. అన్ని శాఖల్లోనూ అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. లెటెస్ట్‌గా CFMS ఖాతాకు ఆలస్యంగా చలాన్లు చేరడంపై అనుమానాలు కమ్ముకున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు అన్ని శాఖల్లో నకిలీ చలాన్ల దందా జరిగినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్‌, రవాణా, మైనింగ్‌, కార్మిక శాఖల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాకు చలాన్లు చేరుతున్నాయా లేదా అన్న వివరాలు సేకరిస్తున్నారు.

నకిలీ చలాన్ల కుంభకోణం ఏపీని కుదిపేస్తోంది. ఈ శాఖ ఆ శాఖ అని కాదు.. అన్ని శాఖల్లోనూ అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. లెటెస్ట్‌గా CFMS ఖాతాకు ఆలస్యంగా చలాన్లు చేరడంపై అనుమానాలు కమ్ముకున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు అన్ని శాఖల్లో నకిలీ చలాన్ల దందా జరిగినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్‌, రవాణా, మైనింగ్‌, కార్మిక శాఖల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాకు చలాన్లు చేరుతున్నాయా లేదా అన్న వివరాలు సేకరిస్తున్నారు.

నకిలీ చలానాల కుంభకోణం సంచలనంగా మారింది. ప్రభుత్వ అధికారులు నకిలీ చలానాలతో కోట్ల రూపాయిలు అక్రమంగా కూడబెట్టారన్న వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అక్రమాలపై 9 క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్‌లో ఈ తరహా అక్రమాలకు చోటు లేకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.

రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో నోటీసులోకి వచ్చిన ఫేక్ చలానాల సంఖ్య ఎంత? ఎంత రికవరీ చేశారు? ఇంకా ఎంత రావాల్సి ఉంది? అన్న వివరాలను జిల్లాల వారిగా సేకరిస్తున్నారు అధికారులు. నకిలీ చలానాలకు సంబంధించి మొత్తం 8లక్షల 13వేల 8వందల రూపాయలు రావాల్సి ఉండగా.. 4లక్షల 62 వేల 56వేలు మాత్రమే రికవరీ చేశారు. ఇంకా 3లక్షల 50 వేల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. 14మంది ఉద్యోగులు ఇందులో ఇన్వాల్వ్‌ అయ్యారని.. వారికి ప్రైవేట్ వ్యక్తులు 33మంది సహకరించినట్టు గుర్తించారు. ఒక్క రిజిస్ట్రషన్ శాఖలోనే కాదు ఎక్సైజ్‌, రవాణా, మైనింగ్‌, కార్మిక శాఖల్లో అధికారుల తనిఖీలు చేపట్టారు. దీంతో ఎంత మొత్తంలో ఫేక్ చలానాలు బయటికొస్తాయోనన్న చర్చ మొదలైంది.

Read also:  Rakul Preet Singh: ఈడీ కార్యాలయంలో కొనసాగుతోన్న విచారణ… అధికారులు ఏర్పాటు చేసిన లంచ్ నిరాకరించిన రకుల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu