Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pig Farming: బ్యాంక్ ఉద్యోగం వదిలి పెట్టాడు.. మెలకువలు నేర్చుకున్నాడు.. లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..

రైతు రాజుగా మారాలంటే వ్యవసాయంలో ఆర్ధిక కోణం వెతుకోవాలని ఓ వ్యవసాయ ఆర్ధిక నిపుణుడు సూత్రీకరించాడు. ఆయన చెప్పినట్లుగానే ఈ మధ్యకాలంలో చాలా మంది రైతులు...

Pig Farming: బ్యాంక్ ఉద్యోగం వదిలి పెట్టాడు.. మెలకువలు నేర్చుకున్నాడు.. లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..
Pig Farming
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 03, 2021 | 3:38 PM

రైతు రాజుగా మారాలంటే వ్యవసాయంలో ఆర్ధిక కోణం వెతుకోవాలని ఓ వ్యవసాయ ఆర్ధిక నిపుణుడు సూత్రీకరించాడు. ఆయన చెప్పినట్లుగానే ఈ మధ్యకాలంలో చాలా మంది రైతులు తమకు ఇష్టమైన వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో వ్యవసాయం అత్యంత శక్తివంతమైన ఉపాధి మాధ్యమంగా మారుతోంది. ఎందుకంటే ఇప్పుడు రైతు కుటుంబానికి చెందిన వ్యక్తులు మాత్రమే కాకుండా వృత్తిపరమైన వ్యక్తులు కూడా ఇందులో ఉంటారు. లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగాలు వదిలేసి తమ గ్రామాలకు తిరిగి వచ్చిన తర్వాత చాలా మంది ఇదే పనిలో ఉన్నారు. అలాంటి రైతు ఆనంద్ సంజీత్ పూర్తీ. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ నివాసి అయిన సంజీవ్ తన బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసి పందుల పెంపకాన్ని మొదలు పెట్టాడు. దీనితో పాటు అతను ఈ రోజు తన గ్రామానికి ఒక రోల్ మోడల్‌గా మారాడు.

జార్ఖండ్‌లో పందుల పెంపకం కొత్త విషయం కాదు. పూర్వం రైతులు సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే పందులను పెంచుకునేవారు. కానీ ఇప్పుడు అది మారింది. పందుల పెంపకంకు కొంత టెక్నాలజీని జోడించాడంతో ఇప్పుడు చాలా మర్పులు వస్తున్నాయి. దీంతో ఆదాయం కూడా చాలా పెరిగింది.

మీకు ఉద్యోగం నచ్చకపోతే.. గ్రామానికి వెళ్లండి..

పట్టణం పొమ్మంటే.. కన్న తల్లిలాంటి ఊరు రమ్మంటోంది. అచ్చు ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యాడు ఆనంద్ సంజిత్ పుర్తి. తాను పూణేలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతనికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. వేలల్లో జీతం.. పెద్ద నగరంలో జీవితం. కానీ అతనికి ఉద్యోగం నచ్చకపోతే 2010 లో అతను తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఇక్కడ స్వయం ఉపాధి కోసం వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో అతను ప్రొఫెసర్ జెఎస్ సోరెన్‌ని కలిశాడు. ప్రొఫెసర్ సోరెన్ ఇచ్చిన సలహాలను తీసుకుని కొత్త పద్దతులను ఫాలో అయ్యాడు. దీని తరువాత ఆనంద్ కృషి విజ్ఞాన కేంద్రం నుండి పందుల పెంపకంపై శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పొందిన తరువాత అతను పందుల పెంపకాన్ని ప్రారంభించాడు.

రెండు సంవత్సరాలు ఇలా గడిపారు

పూణే నుండి తిరిగి వచ్చిన తరువాత కొంత కాలం తిరిగి ఉద్యోగంలో చేరాలా.. ఏదైనా స్వయం ఉపాధి కార్యక్రమం వైపు వెళ్లాలా అనే డైలామాలో ఉండిపోయాడు. ఇలా రెండు సంవత్సరాలు చూస్తుడగా గడిచిపోయింది. ఈ సమయంలో అతను కొన్ని జాబ్ ఇంటర్వ్యూలను కూడా హాజరయ్యాడు. తాను హాజరైన ఇంటర్య్వూల్లో కూడా ఎంపికయ్యాడు. కానీ ఆ ఉద్యోగాల్లో మాత్రం చేరలేదు.

డిపాజిట్ చేసిన మూలధనంతో పందుల పెంపకం 

సలహాలు పొందిన తరువాత ఆనంద్ తన సేకరించిన గ్రామంలోనే పందుల పెంపకాన్ని ప్రారంభించాడు. ప్రారంభంలో   ఐదు ఆడ పందులు, ఒక మగ పంది.. ఆరు మేకలు ఉన్నాయి. కానీ పందికి సరైన సంరక్షణ లేకపోవడం వల్ల అతను సంతానోత్పత్తికి సరిపోడు.. కాబట్టి అతను దానిని విక్రయించాడు. ఆ తర్వాత మళ్లీ ప్రభుత్వ సాయం తీసుకున్నాడు.  ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరు లక్షల రూపాయల సాహయంతో తిరిగి పిగ్ ఫామింగ్ మొదలు పెట్టాడు.

మెరుగైన జాతి పంది ఎంపిక..

శిక్షణ పొందిన తరువాత ఆనంద్ పందుల పెంపకం గురించి సమాచా తీసుకున్నాడు. అప్పుడు తాను స్వదేశీ పంది జాతిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను అధునాతన జాతి DND జాతి పందిని పెంచడం ప్రారంభించాడు. ఇది జార్ఖండ్‌కు అనుకూలమైనది. ఈ జాతిని బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేశాడు. ఈ రోజు పందుల పెంపకం ద్వారా ఆనంద్ ఏటా నాలుగు నుండి నాలుగున్నర లక్షలు సంపాదిస్తాడు.

ఇవి కూడా చదవండి: Delhi Mysterious Tunnel: ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో బయటపడ్డ భారీ సొరంగం.. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే..?

Solar Storm: అదే జరిగితే ఇంటర్నెట్‌ బంద్‌.. భూమికి పొంచివున్న ముప్పు.. ఆందోళన కలిగిస్తున్న శాస్త్రవేత్తల రిపోర్టు