AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Alert: మీరు కూడా ఆ తప్పు చేస్తున్నారా.. అయితే మీ ఖాతా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది.. ఎందుకో తెలుసా..

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో మీకు అకౌంట్ వుందా..? అయితే ఆ ఖాతాలో నిత్యం లావాదేవీలు నిర్వహిస్తున్నారా..? ఆ ఖాతాలో డబ్బులు వేయడం కానీ..

SBI Alert: మీరు కూడా ఆ తప్పు చేస్తున్నారా.. అయితే మీ ఖాతా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది.. ఎందుకో తెలుసా..
Sbi
Sanjay Kasula
|

Updated on: Sep 03, 2021 | 6:34 PM

Share

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో మీకు అకౌంట్ వుందా..? అయితే ఆ ఖాతాలో నిత్యం లావాదేవీలు నిర్వహిస్తున్నారా..? ఆ ఖాతాలో డబ్బులు వేయడం కానీ.. డబ్బులును తీయడం కానీ చేయకుంటే ఏం జరుగనుందో బ్యాంక్ ఇందుకు సంబంధించిన  ఓ అలెర్ట్ మెసెజ్ మీ ఫోన్‌కు ఇప్పటికే వచ్చి ఉంటుంది. స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ కి పలు జాగ్రత్తలను ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్‌బీఐ బ్యాంక్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్‌లో 44 కోట్ల మంది కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు అనేక సౌకర్యాలను అందిస్తుంది. ఇప్పుడు చాలా బ్యాంకింగ్ పనులు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా మాత్రమే పూర్తవుతున్నాయి. కానీ, దీనితో పాటుగా ఖాతాదారులు పాటించాల్సిన అనేక బ్యాంక్ నియమాలు కూడా ఉన్నాయి. ఈ నియమాలను పాటించకుంటే మీ ఖాతాను డీయాక్టివేట్ చేస్తుంది బ్యాంకు. ఆ తర్వాత బ్యాంక్ ఖాతా నుండి ఎలాంటి లావాదేవీలను మీరు చేయలేకపోవచ్చు. ఉదాహరణకు.. మీరు బ్యాంక్ ఖాతా నుండి నిర్దిష్ట సమయం వరకు ఎలాంటి లావాదేవీ చేయకపోతే.. బ్యాంక్ ఆ ఖాతాను మూసివేస్తుంది. దీని తరువాత  మీరు ఆ అకౌంట్‌ను  మళ్లీ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటి పరిస్థితి మీ ఖాతాకు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మీ ఖాతాకు వస్తే.. ఆ ఖాతాను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అది ఎలానో ముందుగా తెలుసుకోండి. మీరు ఈ ప్రక్రియను అనుసరించకపోతే  మీ ఖాతా నిలిచిపోతుంది. SBI ఈ ప్రత్యేక నియమాల గురించి తెలుసుకోండి. ప్రతి ఖాతాదారుడు బ్యాంక్ నియమాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

మీ ఖాతా ఎప్పుడు క్రియారహితంగా మారుతుంది?

RBI మార్గదర్శకాల ప్రకారం.. రెండేళ్లపాటు పొదుపు లేదా కరెంట్ ఖాతాలో ఎలాంటి లావాదేవీ జరగకపోతే అది ‘పనికిరాని’ ఖాతా కేటగిరీలో చేర్చబడుతుంది. ఇది 10 సంవత్సరాల పాటు కొనసాగితే.. అంటే, 10 సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీ జరగలేదని అనుకుందాం. అప్పుడు అందులో డిపాజిట్ చేయబడిన డబ్బు, దాని వడ్డీ, విద్యఅవగాహన నిధికి బదిలీ చేయబడుతుంది. అయితే, అలా చేయడానికి ముందు  బ్యాంక్ దాని గురించి కస్టమర్‌కు కూడా తెలియజేస్తుంది.

ఖాతాను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

SBI షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడానికి.. ముందుగా  KYC అప్‌డేషన్ పూర్తి చేయాలి. అంటే మీ KYC డాక్యుమెంట్‌లన్నీ బ్యాంకుకు సమర్పించాలి. ఇది కాకుండా, కస్టమర్ కూడా బ్యాంకుకు వెళ్లి డెబిట్ లావాదేవీ చేయాల్సి ఉంటుంది. ఈ లావాదేవీ తప్పనిసరిగా బ్యాంక్ ద్వారా మాత్రమే జరగాలని గుర్తుంచుకోండి.  ఆ తర్వాత KYC డాక్యుమెంట్‌తో బ్యాంక్ శాఖను సందర్శించాలని బ్యాంక్ తెలియచేసింది. మీరు మీ బ్యాంక్ బ్రాంచ్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Pig Farming: బ్యాంక్ ఉద్యోగం వదిలి పెట్టాడు.. మెలకువలు నేర్చుకున్నాడు.. లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..