Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF: పీఎఫ్ ఖాతాదారులు అలర్ట్..! ఇక నుంచి రెండు అకౌంట్ల నిర్వహణ.. ఏంటో తెలుసుకోండి..

EPF: EPF ను ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ (EPS) అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ పెన్షన్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తుంది. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగం చేసేవారికి ఈ ఫండ్ నుంచి పెన్షన్ ఏర్పాటు

EPF: పీఎఫ్ ఖాతాదారులు అలర్ట్..! ఇక నుంచి రెండు అకౌంట్ల నిర్వహణ.. ఏంటో తెలుసుకోండి..
Epf
Follow us
uppula Raju

|

Updated on: Sep 03, 2021 | 2:41 PM

EPF: EPF ను ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ (EPS) అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ పెన్షన్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తుంది. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగం చేసేవారికి ఈ ఫండ్ నుంచి పెన్షన్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం జీతంలో కొంత భాగం పెన్షన్ ఫండ్‌కు కలుపుతారు. పనిచేసే కంపెనీ, ఉద్యోగి ఇద్దరూ ఇపిఎఫ్‌కు సహకరించాలి. తద్వారా ఉద్యోగి విరమణ చేస్తే పెన్షన్‌గా కొంత మొత్తాన్ని పొందుతాడు. ఈ పని యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా యుఎన్ ద్వారా జరుగుతుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ నిబంధనలను కొన్నింటిని సవరించింది. కొత్త నిబంధనలను జారీ చేసింది.

ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌)కు రూ.2.5 లక్షలుపైగా చెల్లించేవారు ఇక నుంచి వేరువేరుగా రెండు ఈపీఎఫ్‌ ఖాతాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీఎఫ్‌ ఖాతాల్లో రూ.2.5 లక్షలకుపైబడి జమ అయ్యే మొత్తంపై వడ్డీకి పన్ను విధించనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లో ప్రవేశపెట్టిన నిబంధన మేరకు ఈ అసెస్‌మెంట్‌ సంవత్సరం నుంచి పన్ను ఉంటుంది.

అధికంగా పీఎఫ్‌ జమచేసే వారి ఖాతాలను రెండుగా &ఒక టాక్స్‌బుల్‌ పీఎఫ్‌ ఖాతా, మరో నాన్‌-టాక్స్‌బుల్‌ ఖాతా& విభజించడంవల్ల పన్ను చెల్లింపుదారుకు పన్ను లెక్కింపు సరళతరమవుతుందని సీబీడీటీ తెలిపింది. ఇదిలా ఉంటే.. ప్రతి ఉద్యోగి/కార్మికుడు వెంటనే తమ తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలని EPFO ప్రకటించిన సంగతి తెలిసిందే. లేకపోతే కంపెనీలు/సంస్థ యజమానులు వాళ్ల ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలోకి డబ్బు జమ చేయడం సాధ్యం కాదు. రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందడమూ వీలుకాదు. పీఎఫ్ ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించాలి.

AP Weather Alert: బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం.. ఏపీలో రాగల 3 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

Fake challan Scam: అన్ని శాఖల్లోనూ అవినీతి.. ఏపీని కుదిపేస్తోన్న నకిలీ చలాన్ల కుంభకోణం

500 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. 13 బంతుల్లో 66 పరుగులు.. బౌలర్లను ఉతికిఅరేశాడు..