500 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. 13 బంతుల్లో 66 పరుగులు.. బౌలర్లను ఉతికి ఆరేశాడు..

కరేబీయన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరుస్తున్నాయి. బ్యాట్స్‌మెన్లు చిన్న సైజు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఈ లీగ్‌లో ఎన్నో మ్యాచ్‌లు..

500 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. 13 బంతుల్లో 66 పరుగులు.. బౌలర్లను ఉతికి ఆరేశాడు..
Chase
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 04, 2021 | 8:30 PM

కరేబీయన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరుస్తున్నాయి. బ్యాట్స్‌మెన్లు చిన్న సైజు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఈ లీగ్‌లో ఎన్నో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. ఇదే కోవలో తాజాగా జరిగిన ఓ మ్యాచ్ ప్రేక్షకులకు కావాల్సినంత మజా ఇచ్చింది. 29 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ సృష్టించిన తుఫాన్ ఇన్నింగ్స్‌ మొత్తం మ్యాచ్‌ను శాసించింది. అతడు మ్యాచ్ విన్నర్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక అతడెవరో కాదు వెస్టిండీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రోస్టన్ ఛేజ్. సెయింట్ లూసియా కింగ్స్, గయానా వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఛేజ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్లు మొదటి రెండు ఓవర్లలోనే పెవిలియన్ చేరారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోస్టన్ ఛేజ్ మొత్తం బ్యాటింగ్‌ను శాసించాడు. మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌కు మార్క్ దయాల్‌తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 79 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన ఛేజ్.. 50 బంతులు ఎదుర్కుని 85 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. అంటే, రోస్టన్ ఛేజ్ కేవలం 13 బంతుల్లో 500 స్ట్రైక్‌రేట్‌తో 66 పరుగులు చేసినట్లు అన్నమాట. దీనితో లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లకు 149 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.

ఇక లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన గయానా వారియర్స్ కేవలం 98 పరుగులకే ఆలౌట్ అయింది. లూసియా కింగ్స్ బౌలర్లకు గయానా వారియర్స్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. కెప్టెన్ నికోలస్ పూరన్(41) అత్యధిక స్కోరర్. లూసియా కింగ్స్ బౌలర్లలో జ్యూవలర్ రాయల్ మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన రోస్టన్ ఛేజ్, బంతితోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లలో 16 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అతడి ఆల్‌రౌండ్ షోకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..