Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

 viral video: మందు బాబులు చేసే హడావిడి మాములుగా ఉండదు. కిక్కు ఎక్కితే వాళ్ళు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. నిషా ఎక్కిందా నిజాలు తన్నుకొస్తాయంటారు.

మద్యం మత్తులో యువతి హల్‌చల్..  కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..
Drunk Girl Video
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2021 | 5:51 PM

viral video: మందు బాబులు చేసే హడావిడి మాములుగా ఉండదు. కిక్కు ఎక్కితే వాళ్ళు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. నిషా ఎక్కిందా నిజాలు తన్నుకొస్తాయంటారు. మత్తు ఎక్కువైందా ఎక్కడి లేని దైర్యం వచ్చేస్తుంది. ఆ కిక్కులో వాళ్ళు చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తుంటాయి.. మందు బాబులు చేసే హంగామాకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో పోలీసులకు చిక్కిన తర్వాత మందు బాబులు చేసే పనులు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అయితే అబ్బాయిలే కాదు మగువలు కూడా మందు మైకంలో రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఓ యువతి నడి రోడ్డు పై నానా హంగామా చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని అంబర్ నాధ్ వద్ద జరిగింది. రాత్రి సమయంలో ఓ యువతి మద్యం సేవించి రోడ్డు పై రచ్చ చేసింది.

రోడ్డు పైకి వచ్చిన ఆ యువతి వాహనాలను అడ్డుకుంటూ .. అక్కడ ఉన్నవారిపై అరుస్తూ హంగామా చేసింది. దాదాపు గంట సేపు ఆ యువతి రోడ్డు పై నిలబడి రచ్చ చేసింది. ఈ తతంగాన్ని అంతా అక్కడ ఉన్నవారు సెలఫోన్స్‌లో చిత్రీకరించారు. దాంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే యువతి రోడ్డు పై ఇలా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తుంటే అక్కడ ఉన్నవారు ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ యువతి పిచ్చి చేష్టలను చూస్తూ ఉండిపోయారు. చివరకు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kartikeya’s Raja Vikramarka : ఎన్ఐఏ‌ ఆఫీసర్‌గా కార్తికేయ…ఆకట్టుకుంటున్న ‘రాజా విక్రమార్క’ టీజర్..

Singer Sunitha: ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత

Mahesh Babu: బాలీవుడ్ స్టార్‌తో కలిసి నటించనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. యాడ్ షూట్ లీక్..