Singer Sunitha: ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత

సింగర్‌గా , డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు సునీత. అందమైన గాత్రంతోనే కాదు రూపంలోనూ నిండైన తెలుగుదనంతో ఆకట్టుకుంటుంటారు సునీత.

Singer Sunitha: ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత
Sunitha

Sunitha : సింగ‌ర్‌గా.. టెలివిజన్‌ యాంకర్‌గా… డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు సునీత. పలు షోలకు జడ్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు ఆమె. అందమైన గాత్రంతోనే కాదు రూపంలోనూ నిండైన తెలుగుదనం ఆమె సొంతం. ఎన్నో వందల పాటలు పాడిన సునీత.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆమెకు ఫ్యాన్‌ పాలోయింగ్‌ ఉంది. ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఇటీవలే వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తరచూ తన ఫోటోలను, భర్త రామ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో సునీత ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ఎంతో భావోద్వేగంగా ఆ పోస్ట్‌‌లో రాసుకొచ్చారు సునీత.  ఇంతకు సునీత అంతలా ఎందుకు ఎమోషనల్ అయ్యారంటే..

తన గొంతుతో ఎంతో మందిని అలరించారు గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం. దాదాపు నలభై వేలకు పైగా పాటలు పాడి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఎస్పీబీ. నటుడిగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా.. సింగర్‌గా.. మ్యూజిక్  డైరెక్టర్‌గానూ ప్రేక్షకులను అలరించారు బాలు. గత ఏడాది కరోనా మహమ్మారి బాలును మనకు భౌతికంగా దూరం చేసిన విషయం తెలిసిందే. కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన బాలు.. చికిత్సా ఫలితం లేకుండా 2020 సెప్టెంబరు 25 న తుది శ్వాస విడిచారు. ఆయన మరణం కోట్లాది మంది అభిమానుల కంట కన్నీరు పెట్టించింది. ఆ గానగంధర్వుడు ఈ లోకాన్ని విడిచి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో సునీత ఎమోషనల్ అయ్యారు. బాలు- సునీత ఎంత కలివిడిగా, ఆప్యాయంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు కలిసి స్టేజ్ పైన పాటలు పాడుతుంటే శ్రోతలు అలా మైమరచి పోతుంటారు. మావయ్య అంటూ సునీత తన అభిమానాన్ని బాలుపై కురిపిస్తూ ఉంటారు.

తాజాగా సోషల్ మీడియాలో బాలసుబ్రహ్మణ్యంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు సునీత. ” మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధం లో నా గొంతు మూగబోతోంది. సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ,ధైర్యం,బలం,నమ్మకం ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చూస్కుంటున్నావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా ..బతికేస్తున్నా..” అంటూ రాసుకొచ్చారు సునీత. 

Click on your DTH Provider to Add TV9 Telugu