Kartikeya’s Raja Vikramarka : ఎన్ఐఏ ఆఫీసర్‌గా కార్తికేయ…ఆకట్టుకుంటున్న ‘రాజా విక్రమార్క’ టీజర్..
యంగ్ హీరో కార్తికేయ ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ

Kartikeya’s Raja Vikramarka: యంగ్ హీరో కార్తికేయ ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. హీరోగానే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే విలన్‌గానూ చేస్తూ ఆకట్టున్నాడు. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ క్రమంలోనే త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా టైటిల్‌తో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు కార్తికేయ. మెగాస్టార్ చిరంజీవి నటించిన రాజా విక్రమార్క అనే టైటిల్‌తో కార్తికేయ కొత్త సినిమా రానుంది. ఈ సినిమాలో ఆయన విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. లవ్-యాక్షన్- ఎమోషన్‌తో కూడిన ఈ సినిమాలో, కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ నటించింది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల బక్రీద్ సందర్భంగా.. ఈ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో కార్తికేయ.. ముస్లిం వేషధారణలో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు.
తాజాగా రాజా విక్రమార్క సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్ఐఏ ఆఫీసర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. ఇక ఈ టీజర్ ఎంతో ఆసక్తిగా ఉంది. ‘మార్నింగ్ కాశ్మీర్‌లో మిలిటెంట్లుకి దొరికిపోయి.. సెకండ్ షో చూడానికి ఢిల్లీకి వచ్చాడు.. వాడిని ఆపడం ఎవరి తరం’ అంటూ ఈ సినిమా కథకు సంబంధించిన హింట్ ఇచ్చారు చిత్రయూనిట్. ”చిన్నప్పుడు కృష్ణ గారిని పెద్దయ్యాక టామ్ క్రూజ్‌ని చూసి ఆవేశపడి జాబ్‌లో జాయిన్ అయిపోయా కానీ.. సరదా తీరిపోతోంది. ఇంక నావల్ల కాదు” అని కార్తికేయ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఈ టీజర్‌ను మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :