Nabha Natesh: బంపర్ ఆఫర్ అందుకున్న ఇస్మార్ట్ బ్యూటీ.. సూపర్ స్టార్ సరసన నభా నటేశ్ ?

యంగ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది నభా నటేశ్

Nabha Natesh: బంపర్ ఆఫర్ అందుకున్న ఇస్మార్ట్ బ్యూటీ.. సూపర్ స్టార్ సరసన నభా నటేశ్ ?
Nabha Natesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 04, 2021 | 2:11 PM

యంగ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది నభా నటేశ్ . ఈ సినిమా తర్వాత అమ్మడు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఆ అమ్మడు నితిన్ హీరోగా నటిస్తోన్న మాస్ట్రో సినిమాలో హీరోయిన్‏గా నటిస్తోంది. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కీలకపాత్రలో నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం నభా నటేశ్ లక్కీ ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించనున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారట. ఒకరు పూజా హెగ్డే కాగా… మరొకరు ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్‏ను ఎంపిక చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక మూడోసారి వీరి కలయికలో వస్తున్న సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ గత సీజన్లలో శత్రువులుగా మారినవాళ్ళు వీరే.. హౌస్‏లో రచ్చ చేసిన కంటెస్టెంట్స్..

Kangana Ranut: జయలలితను తలపించిన కంగనా రనౌత్.. దివంగత ముఖ్యమంత్రి మెమొరియల్ ఘాట్‍కి వెళ్లిన క్వీన్..

The Baker & The Beauty Glimpse: భిన్నమైన రెండు మనసులు ఒకటి అయితే ? .. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ది బేకర్ అండ్ ది బ్యూటీ గ్లింప్స్..

Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ లెటేస్ట్ ఫోటోలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. నెట్టింట్లో సాయి పల్లవి సందడి..