The Baker & The Beauty Glimpse: భిన్నమైన రెండు మనసులు ఒకటి అయితే ? .. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ది బేకర్ అండ్ ది బ్యూటీ గ్లింప్స్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 04, 2021 | 2:18 PM

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ఫ్లాట్‏ఫాంలో దూసుకుపోతుంది ఆహా. బ్లాక్ బస్టర్ సినిమాలతోపాటు..

The Baker & The Beauty Glimpse: భిన్నమైన రెండు మనసులు ఒకటి అయితే ? .. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ది బేకర్ అండ్ ది బ్యూటీ గ్లింప్స్..
Baker And Bueaty

Follow us on

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ఫ్లాట్‏ఫాంలో దూసుకుపోతుంది ఆహా. బ్లాక్ బస్టర్ సినిమాలతోపాటు.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లను ప్రేక్షకులకు అందిస్తుంది తొలి తెలుగు మాధ్యమం ఆహా. తాజాగా మరో వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏక్‌ మినీ కథ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంతోష్‌ శోభన్‌, టినా శిల్పరాజ్‌ జంటగా ది బేకర్‌ అండ్ ది బ్యూటీ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 10న ఆహా వేదికగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ది బేకర్‌ అండ్ ది బ్యూటీ గ్లింప్స్ వీడియో  విడుదల చేశారు మేకర్స్. భిన్నమైన రెండు మనసులు ఒకటి అయితే ? అనే నేపథ్యంతో సాగుతున్న వీడియో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బేకింగ్ వృత్తిలో ఉన్న ఆ కుర్రాడి హృదయాన్ని దోచిన ఆ అమ్మాయి..ఇటు ప్రేక్షకులను కూడా ఫిదా చేస్తోంది. అలాగే ఆహ్లాదమైన అందమైన ప్రేమకథగా ఈ సిరీస్ కనిపిస్తోంది. విభిన్నమైన వృత్తుల నుంచి అమ్మాయి అబ్బాయి కలుసుకున్నాక ఏం జరిగింది? అన్నదే ఈ సిరీస్. క్యాప్షన్ కి తగ్గట్టే లవ్ ఎమోషన్ .. కష్టాలు కన్నీళ్లు అన్నిటినీ తెరపై ఆవిష్కరించనున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌కు జాన్తన్‌ ఎడ్‌వర్డ్స్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో విష్ణు ప్రియ, సాయి శ్వేత, సంగీత్‌ శోభన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, జాన్సీ లక్ష్మీ, వెంకట్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

 

 

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ 5 షురూ.. హౌస్‏లోకి కంటెస్టెంట్స్.. ఫైనల్ లిస్ట్ ఇదే..

Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ లెటేస్ట్ ఫోటోలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. నెట్టింట్లో సాయి పల్లవి సందడి..

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu