Thalaivi Movie: ఓటీటీలోకి కంగనా సినిమా.. తలైవి విడుదల ఎప్పుడంటే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 04, 2021 | 7:04 AM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా తలైవి.తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ

Thalaivi Movie: ఓటీటీలోకి కంగనా సినిమా.. తలైవి విడుదల ఎప్పుడంటే..
Thalaivi

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా తలైవి.తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో జయలలిత పాత్రలో కంగనా నటించింది. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా..విష్ణు ఇందూరి నిర్మించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలే ఈ సినిమాను సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. అయితేఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారని నెట్టింలో వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన మేకర్స్.. ఆ వార్తలలో ఏమాత్రం నిజం లేదని.. తమ మూవీని థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇందుకు కారణం దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన తలైవి ఖచ్చితంగా పెద్ద స్క్రీన్ పై చూడాల్సిన సినిమా అని అన్నారు.

ఇక ఈ చిత్రాన్ని తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను థియేటర్‏తోపాటు.. ఓటీటీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైంలో విడుదల చేయనున్నారని.. ఇందుకోసం రూ. 55 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల తర్వాత నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలతో మేకర్స్ భారీగా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ థియేటర్లో విడుదలైన 4 వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లో తలైవి విడుదల కానున్నట్లగా టాక్ వినిపిస్తోంది.

Also Read: Vijay Devarakonda: మళ్లీ షూరు కానున్న లైగర్.. బాక్సింగ్ రింగ్‏లోకి విజయ్ దేవరకొండ..

Rashmi Gautam: చీరకట్టులో మెరిసిన అందాల తార.. వయ్యారాలు ఒలకబోసిన రష్మీ గౌతమ్ .

Tollywood Heroine: ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.? ఆమె హెయిర్ చూశాక కూడా గుర్తు రావట్లేదా

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu