Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Platforms: థియేటర్స్ తెరుచుకుంటున్నా తగ్గని డిజిటల్ జోరు.. ఓటీటీకే ఓటేస్తున్న హీరోలు..

కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి.. మిగతా రాష్ట్రాల్లో కూడా త్వరలో థియేటర్ల గేట్లు తెరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

OTT Platforms: థియేటర్స్ తెరుచుకుంటున్నా తగ్గని డిజిటల్ జోరు.. ఓటీటీకే ఓటేస్తున్న హీరోలు..
Ott
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 03, 2021 | 9:15 PM

OTT Platforms: కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి.. మిగతా రాష్ట్రాల్లో కూడా త్వరలో థియేటర్ల గేట్లు తెరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా డిజిటల్ జోరు మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికీ స్టార్ హీరోలు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. టాలీవుడ్‌లో ఈ నెల ఇంట్రస్టింగ్ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్‌ ఓటీటీకి స్టార్ మంత్‌ లాంటిది. టాలీవుడ్‌లో ఇద్దరు యంగ్ హీరోలు ఈ నెలల్లో డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌కు వస్తున్నారు. ఆల్రెడీ డేట్ లాక్ చేసుకొని ప్రమోషన్‌ కూడా షురూ చేశారు. టక్‌ జగదీష్.. నాని హీరోగా తెరకెక్కిన పర్పెక్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. థియేట్రికల్‌ రిలీజ్‌ అయ్యుంటే ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న సాలిడ్ కంటెంట్‌. అయినా మేకర్స్ మాత్రం ఓటీటీ రిలీజ్‌కే ఫిక్స్ అయ్యారు. ఫైనాన్షియల్ కాలిక్యులేషన్స్‌తో సెప్టెంబర్ 10న డిజిటల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు.

మరో యంగ్ హీరో నితిన్‌ కూడా ఓటీటీకే ఓటేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ అంధాదున్‌కు రీమేక్‌గా తెరకెక్కిన మాస్ట్రో సినిమా ఈ నెల 17న ఓటీటీలో రిలీజ్ అవుతోంది. తమన్నా, జిష్షు సేన్‌గుప్తా లాంటి క్రేజీ కాస్టింగ్‌ ఉన్నా… మాస్ట్రో నిర్మాతలు మాత్రం థియేటర్‌ కన్నా… ఓటీటీనే సేఫ్‌ అని ఫీల్ అయ్యారు. అందుకే డిస్నీ హాట్‌స్టార్‌లో మాస్ట్రోని రిలీజ్ చేస్తున్నారు. రాహుల్ రామకృష్ణ, అవికా గోర్‌ లీడ్‌ రోల్స్‌లో తెరకెక్కిన నెట్‌ కూడా ఈ నెలలోనే స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. జీ5 ఒరిజినల్‌గా డిజిటల్‌ కోసమే తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 10 నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు అనబెల్‌ సేతుపతి, తుగ్లక్ దర్బార్‌ కూడా ఈ మంత్లోనే ఆడియన్స్‌ ముందుకు రానున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మదమెక్కి నోరు జారితే ఇలానే ఉంటుంది.. పోలీసుల అదుపులో హీరోయిన్.. శిక్ష తప్పదంట..

Buchi Babu Sana : ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా..

MLA RK Roja : టైలర్ అవతారమెత్తిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా..