Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మదమెక్కి నోరు జారితే ఇలానే ఉంటుంది.. పోలీసుల అదుపులో హీరోయిన్.. శిక్ష తప్పదంట..

సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.. పొరపాటున నోరు జారితే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మదమెక్కి నోరు జారితే ఇలానే ఉంటుంది.. పోలీసుల అదుపులో హీరోయిన్.. శిక్ష తప్పదంట..
Meera Mithun
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 03, 2021 | 9:03 PM

Meera Mithun: సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.. పొరపాటున నోరు జారితే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. ఆ హీరోయిన్ ఎవరోకాదు తమిళ నటి మీరా మిథున్. మీరా మిథున్ పై చెన్నై నగర పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. స్థానిక ఎగ్మోర్ కోర్టులో ఈ మేరకు సమర్పించారు. మీరా సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయింది. ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటోంది. తాజాగా దళిత సినిమా కార్మికులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి హాట్‌‌‌టాపిక్‌‌‌గా మారింది. దళిత దర్శకులు, దళిత ఆర్టిస్టులకారణంగానే తనకు సినిమా అవకాశాలు తగ్గాయని ఆరోపించింది.  తమిళ ఇండస్ట్రీలో ఉన్న దళిత దర్శకులు నటీనటులను బయటకు గెంటేయాలని వ్యాఖ్యలు చేసింది. దాంతో ఒక్కసారిగా దుమారం రేగింది. మీరా పై చెన్నై పోలీసులకు అందిన ఫిర్యాదులతో ఆమెపై కేసు నమోదు చేశారు. కేరళకు పారిపోయి దాక్కున్న ఆమెను పట్టుకొని మరీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు ముందు పోలీసులు తనను పట్టుకోవడం కలలోనే జరుగుతుంది అంటూ కోతలు కోసింది. చివరకు పోలీసులకు చిక్కింది.

దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు… మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మీరా మిథున్ విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపారు. దాన్ని కూడా ఆమె లెక్క చేయలేదు. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని ఛాలెంజ్ చేసింది. తనను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుందని సంచలన కామెంట్లు చేసింది మీరా మిథున్. దాంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కేరళలో దాక్కున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆమెపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో ఆమెకు శిక్షపడడం ఖాయమని కొందరు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

JR Ntr: క్రికెట్‌ ఆడటమంటే ఇష్టం.. కానీ చూడను.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఎన్టీఆర్‌.. వీడియో

MAA Elections 2021: సినిమా బిడ్డల ప్యానెల్ ఇదే.. డ్రగ్స్ ఇష్యూపై సంచలన కామెంట్స్ చేసిన ప్రకాశ్ రాజ్

Sidharth Shukla: సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు పూర్తి.. ప్రేయసి కన్నీళ్లు.. గుండె తరుక్కుపోయే సీన్..