Buchi Babu Sana : ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Sep 03, 2021 | 8:32 PM

ఉప్పెన సినిమాతో మొత్తం ఇండస్ట్రీనే తన వైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు సన. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా మంచి విజయాన్ని

Buchi Babu Sana : ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా..
Buchi Babu

Follow us on

Buchi Babu Sana : ఉప్పెన సినిమాతో మొత్తం ఇండస్ట్రీనే తన వైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు సన. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లను కలెక్ట్ చేసి అందరిని అవాక్ అయ్యేలా చేసింది. ఒక కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ ఇలా అందరూ కొత్త వాళ్ళతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచారు. హీరోయిన్ తండ్రిగా నెగిటివ్ పాత్రలో సేతుపతి నటన ఆకట్టుకుంది. ఒక డెబ్యూ హీరో సినిమా ఈ రేంజ్ వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బూచి బాబు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈసినిమా తర్వాత బుచ్చిబాబు ఎవరితో సినిమా చేస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌తో సినిమా చేస్తున్నాడని ఆమధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే ఆ తరువాత వైష్ణవ్ తేజ్ హీరోగానే మరో సినిమాను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం ఓ యంగ్ హీరోతో బుచ్చిబాబు సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో మరో యంగ్ హీరోతో బుచ్చిబాబు సినిమా చేయడానికి సిద్దమయ్యాడని అంటున్నారు. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాకు కూడా దేవీ శ్రీనే  మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకుంటున్నాడట బుచ్చిబాబు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

JR Ntr: క్రికెట్‌ ఆడటమంటే ఇష్టం.. కానీ చూడను.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఎన్టీఆర్‌.. వీడియో

MAA Elections 2021: సినిమా బిడ్డల ప్యానెల్ ఇదే.. డ్రగ్స్ ఇష్యూపై సంచలన కామెంట్స్ చేసిన ప్రకాశ్ రాజ్

Sidharth Shukla: సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు పూర్తి.. ప్రేయసి కన్నీళ్లు.. గుండె తరుక్కుపోయే సీన్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu