MLA RK Roja : టైలర్ అవతారమెత్తిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Sep 03, 2021 | 8:13 PM

R K Roja: ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించి ఇప్పుడు రాజకీయాల్లో తన మాటలతో ప్రత్యర్థులను కడిగిపారేస్తున్నారు నటి, నగిరి ఎమ్మెల్యే రోజా.

MLA RK Roja : టైలర్ అవతారమెత్తిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా..
Roja

R K Roja: ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించి ఇప్పుడు రాజకీయాల్లో తన మాటలతో ప్రత్యర్థులను కడిగిపారేస్తున్నారు నటి, నగిరి ఎమ్మెల్యే రోజా. హీరోయిన్‌గా దాదాపు టాప్ హీలందరి సరసన ఆడిపాడిన రోజా. ఆతర్వాత రాజకీయ ప్రవేశం చేశారు. ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. సినిమాల కంటే టీవీషోలతోనే ఎక్కువగా అభిమానులను ఆకట్టుకుంటున్నారు రోజా. అయితే ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటున్నా.. రాజకీయనాయకురాలిగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. నిత్యం తన నియోజక వర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు రోజా. తాజాగా రోజా టైలర్ అవతారమెత్తారు. అంతే కాదు మిషన్ పై టకటక ఓ యూనిఫామ్ కూడా కొట్టేసారు. నాడు నేడులో భాగంగా ఏకాంబరకుప్పంలో పాఠశాలల్లో విద్యార్థులకు ఎస్ట్రా కరికులం యాక్టివిటీ కోసం నెలకొల్పిన టైలరింగ్ విభాగాన్ని రోజా ప్రారంభించారు. ఆతర్వాత స్వయంగా ఓ స్కూల్ యూనిఫామ్ కొట్టారు.

నగరి మునిసిపాలిటీ పరిధి 22వ వార్డు ఏకాంబరకుప్పంలో 58.90 లక్షల రూపాయలతో నాడు-నేడు మొడటివిడతలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆధునీకరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. సీఎం వైఎస్ జగన్ విద్యార్థుల తలరాతలను మార్చేందుకు పాఠశాలలు రూపు రేఖలు మారుస్తున్నారు అని రోజా అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

JR Ntr: క్రికెట్‌ ఆడటమంటే ఇష్టం.. కానీ చూడను.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఎన్టీఆర్‌.. వీడియో

MAA Elections 2021: సినిమా బిడ్డల ప్యానెల్ ఇదే.. డ్రగ్స్ ఇష్యూపై సంచలన కామెంట్స్ చేసిన ప్రకాశ్ రాజ్

Sidharth Shukla: సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు పూర్తి.. ప్రేయసి కన్నీళ్లు.. గుండె తరుక్కుపోయే సీన్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu