Laabam Movie: రైతుల సమస్యలపై పోరాడేందుకు సిద్దమైన విజయ్ సేతుపతి.. ఆసక్తికరంగా ‘లాభం’ ట్రైలర్
తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం లాభం. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది.
Laabam Movie: తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం లాభం. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకమైన కీలక పాత్ర పోషించింది. ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) నిర్మించారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. తెలుగు తమిళ్‌లో ఒకే పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. లాభం సినిమాలో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా కనిపించనున్నాడు. మార్కెట్‌కు వచ్చేటప్పుడు అందులో లాభం అనేది కలుస్తుంది. అదే నిలువు దోపిడీగా మారుతుంది. అక్కడే రెండు వర్గాలుగా చీలుతుంది… అంటూ విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఇక ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ దూకుపోతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గానూ నటిస్తూ మెప్పిస్తున్నాడు మక్కల్ సెల్వన్. ఇప్పటికే హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పించిన మక్కల్ సెల్వన్… హోస్ట్‌గానూ అదే స్థాయిలో ఆకట్టుకుంటానంటున్నాడు. ఇంటర్‌నేషనల్ లెవల్‌లో సూపర్ హిట్ అయిన మాస్టర్ చెఫ్ అనే రియాలిటీ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు లాభం సినిమాతో సెప్టెంబర్ 9న సందడి చేయనున్నాడు మక్కల్ సెల్వన్. లాభం ట్రైలర్ పై మీరూ ఓ లుక్కెయండి..
మరిన్ని ఇక్కడ చదవండి :