Tuck Jagadish: టక్‌ జగదీష్ సినిమా కొత్త పాట విడుదల.. శివ నిర్వాణ ఈ పాటను ఎలా పాడారో విన్నారా.?

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Sep 03, 2021 | 12:58 PM

Tuck Jagadish: నాని హీరోగా తెరకెక్కిన చిత్రం 'టక్‌ జగదీష్‌'. నిన్నుకోరి, మజిలీ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత శివా నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో...

Tuck Jagadish: టక్‌ జగదీష్ సినిమా కొత్త పాట విడుదల.. శివ నిర్వాణ ఈ పాటను ఎలా పాడారో విన్నారా.?
Tuck Jagadish

Tuck Jagadish: నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. నిన్నుకోరి, మజిలీ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత శివా నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీగా అంచనాలున్నాయి. ఇందులో రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను తొలుత థియేటర్లలో విడుదల చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ చిత్ర యూనిట్‌ చివరి క్షణంలో ఓటీటీ వేదికగా విడదుల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టక్‌ జగదీష్‌ అమేజాన్‌ వేదికగా వినాయకచవితి కానుకగా సెప్టెంబర్‌ 10న విడదుల కానుంది.

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్‌ వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేయగా.. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాలోని మరో పాటను విడుదల చేసింది. హీరో పాత్ర తీరును వర్ణిస్తూ ఉన్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘సల్లాటి కుండలో సల్ల సక్క మనసు వాడు’ అనే సాగే పాట లిరిక్స్‌ అట్రాక్ట్‌ చేస్తున్నాయి.

ఇక ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ ఆలపించడం మరో విశేషం. చిత్ర యూనిట్‌ ఈ పాటను వినూత్నంగా ప్రమోట్‌ చేసింది. తొలుత ఈ పాటను దర్శకుడు, సంగీత దర్శకుడు హీరో నానితో పాడించాలనుకోగా.. నాని కోరిక మేరకు దర్శకుడే పాడినట్లు చూపించారు. ఈ పాట విడుదలైన కేవలం కొద్ది క్షణాల్లో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. మరి ఈ కొత్త పాటను మీరూ వినేయండి.

Also Read: Beautiful Mosquito: ప్రపంచంలోనే అత్యంత ‘అందమైన దోమ’.. ఎక్కడ.. ఏ దేశంలో ఉందంటే..

Smartphone Hang: మీ ఫోన్‌ పదే పదే హ్యాంగ్‌ అవుతోందా..? అయితే ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి, రిజల్ట్‌ ఉంటుంది.

Trai: టెలికాం కంపెనీలపై ట్రాయ్‌ కన్నెర్ర.. కీలక ఆదేశాలు జారీ.. హద్దులు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరిక..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu