Beautiful Mosquito: ప్రపంచంలోనే అత్యంత ‘అందమైన దోమ’.. ఎక్కడ.. ఏ దేశంలో ఉందంటే..

World Beautiful Mosquito: ఒక చిన్న ప్రాణి దోమ.. మనిషి రక్తాన్ని పీల్చి అనేక రకాల వ్యాధులకు కారణమైన కీటకం. ఈ పరాన్న జీవి వ్యాధులను ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపజేసే వాహకాలుగా..

Beautiful Mosquito: ప్రపంచంలోనే అత్యంత 'అందమైన దోమ'.. ఎక్కడ.. ఏ దేశంలో ఉందంటే..
Beautiful Mosquito
Follow us
Surya Kala

|

Updated on: Sep 03, 2021 | 12:43 PM

World Beautiful Mosquito: ఒక చిన్న ప్రాణి దోమ.. మనిషి రక్తాన్ని పీల్చి అనేక రకాల వ్యాధులకు కారణమైన కీటకం. ఈ పరాన్న జీవి వ్యాధులను ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపజేసే వాహకాలుగా పనిచేస్తాయి. ప్రపంచంలోనే అనేక దేశాలను భయపెట్టే ఈ చిన్న జీవి.. కనిపిస్తే చాలు ఒక దెబ్బ వేసి చంపేయాలని చూస్తాం.. ఇక మన మీద వాలి రక్తం తాగుతుంటే.. వెంటనే దోమపై ఒక్కటిచ్చి దానిని చంపెయ్యడమో.. లేదా దోమ మన వంటి మీద నుంచి లేకుండా పారిపోయేలా చేయడమో చేస్తాం..ఇక సీజనల్ వ్యాధులకు కారణమైన దోమలు రాకుండా మస్కిటో క్వాయిల్స్, దోమతెరలు వంటి రక్షణలను వాడతాం.. అయితే దోమల్లోకెల్లా ఓ వింత దోమ ఉందట.. దీనిని చూస్తే చంపడం అనే మాటని మరచిపోతామట. ఆ దోమనే చూస్తూ అలా ఉండిపోతామట అంత అందంగా ఉంటుందట ఈ దోమ..

అందమైన ఈకలతో , అంతకంటే అందమైన రంగులతో ఉన్న కాళ్లు, ప్రకాశవంతమైన రంగులతో ఇంద్రధనస్సునే తలపించేలా మెరుస్తూ మైమరిపించేలా ఓ దోమ ఉంది.. ఇవి ఎక్కువగా మధ్య, దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల అడవుల్లో కనిపిస్తాయి. వీటిని ”సబెథెస్ దోమ”లని అంటారు. ఈ మస్కిటో ఫ్యామిలీ కొంచెం వింత ఫ్యామిలీ అట. అయితే కొన్ని రకాల వ్యాధులను కూడా ఈ అందమైన దోమలు వ్యాపింపజేస్తాయని అంటున్నారు. రంగుల ఈకలు, ఆకుపచ్చ రంగు దేహం, కలర్స్ కాళ్లుతో ఆకట్టుకుంటున్న ఈ దోమ ఫోటోని కెనడాలోని ఒంటారియోకి చెందిన గిల్ విజెన్ తీశారు. ఈ ఏడాది వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో ఆయన ప్రశంసలు పొందారు.

ఈ సందర్భంగా ప్రకృతిలోని చిన్న కదలికలకు, కాంతి తీవ్రతలో మార్పులకు ప్రతిస్పందించే ఈ దోమను ఫొటో తీయాలంటే కాస్త కష్టమేనని గిల్ విజెన్ చెప్పారు. ఇక ఈ దోమలు ఎప్పడూ గుంపులుగుంపులుగా సంచరిస్తుంటాయి. సబెథెస్ దోమలు ఎల్లో ఫీవర్, డెంగ్యూ జ్వరం వంటి అనేక వ్యాధులకు ముఖ్యమైన వాహకాలు. అయితే ఈ దోమలను ఫోటో తీసే సమయంలో ఈ దోమతోపాటు మరిన్ని దోమలు నన్ను కుట్టాయి.. తనకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.. అయితే తాను ఇంకా సజీవంగానే ఉన్నాను” అని గిల్ అన్నారు.

ఈ దోమలపై శాస్త్రజ్ఞులు మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. వీటి రూపంతో పాటు, ఈ దోమల వల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయా? లేదా? ఈ దోమలు ఎటువంటి రోగాలు వ్యాప్తి చేస్తాయి వంటి అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.

Also Read:  తమిళనాడు అసెంబ్లీలో జనసేనాని ప్రస్తావన.. పవన్ ట్విట్‌తో సీఎం స్టాలిన్‌పై మంత్రి ప్రశంసల వర్షం..