AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీలో జనసేనాని ప్రస్తావన.. పవన్ ట్విట్‌తో సీఎం స్టాలిన్‌పై మంత్రి ప్రశంసల వర్షం

TN Assembly on Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీ లో  జనసేన అధినేత పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. డిఎమ్ కే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ని ప్రస్తావించారు.  తమిళనాడు సీఎం స్టాలిన్..

Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీలో జనసేనాని ప్రస్తావన.. పవన్ ట్విట్‌తో సీఎం స్టాలిన్‌పై మంత్రి ప్రశంసల వర్షం
Tamil Nadu
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 03, 2021 | 6:23 PM

Share

Tamil Nadu Assembly on Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీ లో  జనసేన అధినేత పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. డిఎమ్ కే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ని ప్రస్తావించారు.  తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనపై ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ట్విట్ ని అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ ప్రస్తావిస్తూ.. పవన్ కళ్యాణ్ ట్వీట్ ని తెలుగులో చదివి వినిపించారు. ఈ సందర్భంలో అసెంబ్లీలోని మిగిలిన ఎమ్మెల్యేలు, సీఎం స్టాలిన్ చిరునవ్వులు చిందించారు.. అయితే పవన్ కళ్యాణ్ ట్విట్ ని చదువుతూ.. సీఎం స్టాలిన్ పై మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో తనను పొగిడితే చర్యలుంటాయని సీఎం స్టాలిన్ హెచ్చరించిన నేపథ్యంలో మరి తన కేబినెట్ లోని మంత్రి పొగిడిన విషయం ఎలా స్పందిస్తారో చూడాలి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్‌కి పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు.” అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే ..

Also Read:   సిద్ధార్ద్ తల్లిని పరామర్శించిన రాహుల్ మహాజన్… కారణం ఏదైనా మరణించిన మనిషి తిరిగిరారు.. ఇక వదిలెయ్యండి అంటూ..