Sidharth Shukla: సిద్ధార్ద్ తల్లిని పరామర్శించిన రాహుల్ మహాజన్… కారణం ఏదైనా మరణించిన మనిషి తిరిగిరారు.. ఇక వదిలెయ్యండి అంటూ..

 Sidharth Shukla Residence: బిగ్ బాస్ 2 ఫేమ్ , నటుడు రాహుల్ మహాజన్ గురువారం దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సిద్ధార్ద్ మరణంతో..

Sidharth Shukla: సిద్ధార్ద్ తల్లిని పరామర్శించిన రాహుల్ మహాజన్... కారణం ఏదైనా మరణించిన మనిషి తిరిగిరారు.. ఇక వదిలెయ్యండి అంటూ..
Siddhardh Sukla
Follow us
Surya Kala

|

Updated on: Sep 03, 2021 | 11:38 AM

Sidharth Shukla Residence: బిగ్ బాస్ 2 ఫేమ్ , నటుడు రాహుల్ మహాజన్ గురువారం దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సిద్ధార్ద్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రాహుల్ , సిద్ధార్థ్ లు మంచి  స్నేహితులు.  ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. స్నేహితుడిని కోల్పోవడం ఎల్లప్పుడూ కష్టమేనని చెప్పారు. అంతేకాదు.. “పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏమైనప్పటికీ, మేము ఒక వ్యక్తిని కోల్పోయాం, తల్లిదండ్రులు తన కొడుకును కోల్పోయారు..  మరణానికి కారణం ఏమైనప్పటికీ ఆ మనిషి ఇక తిరిగి రారు.  మరణం ఒక మెడిసిన్ వలన కావచ్చు.. లేదా అలసటవలన కావచ్చు మరణానికి కారణం ఏమిటి అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు… సిద్ధార్ధ్ ఎలా మరణించాడనేది అతని కుటుంబమని ప్రస్తుతం అవసరం లేదు.. సిద్ధార్ధ్అంత్యక్రియలు జరగాలి అంతే అని అన్నారు.

సిద్ధార్థ్ మరణంపై వస్తున్న వార్తలపై రాహుల్ స్పందిస్తూ.. సిద్దార్ద్ వ్యాయామం చేస్తూ..  సమయం తీసుకున్నాడు. ఒకటిన్నర గంటల వ్యాయామం..  మూడు గంటల్లో పూర్తయింది. కనుక అతను అధిక శ్రమ పడ్డాడు అన్న  ప్రశ్న అస్సలు తలెత్తదు. అలాగే సిద్ధార్ధ్ ఎక్కువగా శాఖాహారాన్నే తీసుకుంటాడు.. అని చెప్పారు రాహుల్. మరి మరణానికి కారణం ఏమిటనేది .. ఈరోజు రానున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వేచి చూడాల్సి ఉందని   చెప్పారు.

సిద్దార్థ్ , షెహ్నాజ్ అభిమానులు.. ఈ మాజీ బిగ్ బాస్ పోటీదారులను సిద్ నాజ్ అని ప్రేమగా పిలుస్తారు. ఇక రాహుల్ తాను సిద్దార్ధ్ మరణం వార్త విన్న తర్వాత షెహ్నాజ్ గిల్‌ను గురువారం సిద్దార్థ్ శుక్లా నివాసంలో కలిసినట్లు చెప్పారు.  పోలీసులకు షెహ్నాజ్ తన వాంగ్మూలాన్ని ఇస్తుంది. వారు దానిని పోలీసులు రికార్డ్ చేస్తున్నారని చెప్పాడు. తుఫాన్ వచ్చి వెళ్లిన తర్వాత ఎలా ఉంటుందో.. ప్రస్తుతం షెహ్నాజ్ పరిస్థితి అలా ఉందని చెప్పాడు రాహుల్.  అంతేకాదు సిద్ధార్థ్ శుక్లా తండ్రి కూడా గుండెపోటుతో మరణించిన విషయం రాహుల్ గుర్తు చేసుకున్నాడు.  “సిద్ధార్థ్ ఒక భిన్నమైన వ్యక్తి, మేము అతని కోసంబాధపడడం.. కన్నీరు పెట్టడం అతనికి ఇష్టపడడు. నేను గురువారం సిద్దార్ధ్ తల్లిని కలుసుకున్నాను. “ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి.. అయితే వాటిన్నంటిని అదిమి పెట్టుకుని.. తన కొడుక్కి మరణం ఇంత త్వరగా రావాల్సింది కాద ని వ్యాఖ్యానించారని తెలిపాడు రాహుల్.  ఏది ఏమైనా ఏ తల్లి అయినా తన కొడుకు.. తన కళ్ళ ముందే ఇంత త్వరగా వెళ్లిపోయాడం ఎలా చూడగలదు అని రాహుల్ అన్నారు.

Also Read:  వ్యర్ధాలకు అర్ధం కల్పించి వస్తువులుగా మారిస్తే.. మంచి ఆదాయం పొందవచ్చు.. మీకోసమే ఈ వివరాలు..