Recycling Business Ideas: వ్యర్ధాలకు అర్ధం కల్పించి వస్తువులుగా మారిస్తే.. మంచి ఆదాయం పొందవచ్చు.. మీకోసమే ఈ వివరాలు..

Recycling Business Ideas: సృష్టిలో పనికి రాని వస్తువు అంటూ ఏమీ లేదు.. వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తే.. అవి కూడా ఉపయోగకరంగా మారతాయని.. ఆదాయాన్ని ఇస్తాయని కొంతమంది అంటున్నారు..

Recycling Business Ideas: వ్యర్ధాలకు అర్ధం కల్పించి వస్తువులుగా మారిస్తే.. మంచి ఆదాయం పొందవచ్చు.. మీకోసమే ఈ వివరాలు..
Recycling Business Ideas
Follow us
Surya Kala

|

Updated on: Sep 03, 2021 | 10:46 AM

Recycling Business Ideas: సృష్టిలో పనికి రాని వస్తువు అంటూ ఏమీ లేదు.. వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తే.. అవి కూడా ఉపయోగకరంగా మారతాయని.. ఆదాయాన్ని ఇస్తాయని కొంతమంది అంటున్నారు. అవును రోజు రాజుకీ భూమి మీద వ్యర్ధాలు పెరిపోతున్నాయి. వీటి నిర్వహణ సమస్యతో కూడుకుందని చాలామంది ఆందోళల వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యర్ధాలతో వాతావరణం, జల కాలుష్యం ఏర్పడుతుంది. ఇక వ్యర్ధాల్లో ఉన్న ప్లాస్టిక్ వంటివి భూమిలో కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి వాడకం తగ్గించమంటూ.. కోరుతున్నారు. అయితే కొన్ని స్టార్టప్ కంపెనీలు వ్యర్ధాలను ఉపయోగించి ఎకో ఫ్రెండ్లీ వస్తువులను తయారు చేస్తున్నారు. వాటిని రీ సైకిల్ చేసి ఆదాయాన్ని ఇచ్చే బిజినెస్ గా మార్చుకుంటున్నారు. కొన్ని రకాల ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ గురించి తెలుసుకుందాం..!

ఎకో ఫ్రెండ్లీ క్రోకరీ:

ఎకో ఫ్రెండ్లీ విస్తరాకులను, ఇతర వస్తువులు హైదరాబాద్‌కు చెందిన మాధవి, వేణుగోపాల్‌ లు తయారు చేస్తున్నారు. ఈ జంట ప్రకృతి మీద ఇష్టంతో కార్పొరేట్‌ కెరీర్‌ను వదిలి.. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించారు. రోజు రోజుకీ ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో తమ ఉత్పత్తులకు కూడా డిమాండ్‌ పెరుగుతుందని వేణుగోపాల్‌ చెప్పారు.

ఫర్నిచర్‌ తయారీ:

ప్రతి ఇంట్లో ఫర్నీచరను తప్పకుండా ఉపయోగిస్తారు. కనుక వ్యర్ధాలను రీ సైక్లింగ్ చేసి.. వాటిద్వారా ఫర్నిచర్ వస్తువులు తయారు చేయడం లాభసాటి అని పూణెకు చెందిన ప్రదీప్‌ జాదవ్‌ అంటున్నారు. ప్రదీప్ టైర్లను, బ్యారెల్స్‌ను ఉపయోగించి కుర్చీలు, టేబుల్, అల్మారా వంటి ఫర్నీచర్లను తయారు చేస్తున్నారు. వీటిని గిగాంటిక్స్‌ ఫర్నిచర్‌ గా పేరు పెట్టారు. ఇప్పటికే భారీ మొత్తంగా ఆర్డర్స్ పొందిన ప్రదీప్.. పెట్టు బడి తక్కువ.. ఆదాయం ఎక్కువ అంటున్నారు. అయితే ఈ వ్యర్ధాలతో ఫర్నిచర్ తయారీ కొంచెం శ్రమతో కూడుకుందని చెబుతున్నారు.

ప్లాస్టిక్స్ కవర్స్ తో ఉత్పత్తులు:

మన ఇళ్లలో క్యారీ బ్యాగ్స్‌ తో వస్తువులను తయారు చేసి.. వాటిని సోషల్ మీడియా వేదికగా అమ్మకం మొదలు పెట్టారు ముంబైకు చెందిన రీటా. క్యారీ బ్యాగ్స్ తో మ్యాట్స్, బ్యాగులు వంటివి తయారు చేసి అమ్ముతున్నారు. ఇవన్నీ రీటా వీడియో చూసి, క్రోచెట్‌ తయారు చేయడం నేర్చుకున్నారు.

ఇంటీరియల్ డెకరేషన్ వస్తువులు:

డెనిమ్ తో అప్‌సైక్లింగ్‌ చేసే పనిని ప్రారంభించారు ఢిల్లీకి చెందిన సిద్ధాంత్‌ కుమార్‌. ఇలా వ్యర్థాలనుంచి వస్తువులను తయారు చేయడం ఐఐటీ బాంబేకు చెందిన డెనిమ్‌ డెకర్‌ వ్యక్తి నుంచి నేర్చుకున్నానని తెలిపారు. డెనిమ్‌తో లాంతర్లు, పెన్‌ హోల్డర్లు తయారు చేస్తున్నామని చెప్పాడు. అంతేకాదు 33 ఏళ్ల మీనాక్షి శర్మ పాత దుస్తులను ఉపయోగించి తివాచీలు, రగ్గులు, బ్యాగులను తయారు చేస్తున్నారు.

హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు:  

వారణాసికి చెందిన శిఖా షా హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉపయోగిస్తూ..పాత ప్లాస్టిక్‌ కంటైనర్లతో ప్లాంటర్లు తయారుచేస్తున్నారు.

ప్లాస్టిక్ కవర్లు, వాడి పాడేసే జీన్స్, టైర్లు, ప్లాస్టిక్‌ సీసాలు, పాత్రలు, బట్టలు, సిలెన్ బాటిల్స్, ఇలా ప్రతి ఒక్కటి ఉపయోగపడేదే… వీటన్నింటిని ఉపయోగించి చిన్న గృహాలంకరణ వస్తువులు తయారు చేయవచ్చు.  తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారం చేయవచ్చు అని అనేక మంది నిరూపిస్తున్నారు.

Also Read:    వెల్లుల్లితో ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చెక్ .. దీనిని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో తెలుసా..