Garlic-Ayurveda: వెల్లుల్లితో ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చెక్ .. దీనిని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో తెలుసా..

Garlic-Ayurveda:భారతీయుల వంటల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం.. అంతేకాదు నీరుల్లి కంటే కూడా వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎక్కువ..

Garlic-Ayurveda: వెల్లుల్లితో ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చెక్ .. దీనిని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో తెలుసా..
Garlic
Follow us
Surya Kala

|

Updated on: Sep 03, 2021 | 9:41 AM

Garlic-Ayurveda:భారతీయుల వంటల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం.. అంతేకాదు నీరుల్లి కంటే కూడా వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎక్కువ. ఇక వెల్లుల్లి వేసిన వంటలు చక్కని రుచి, వాసన వస్తాయి.  ప్లేగుతో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వుని కరిగించేది, పరాన్నభుక్కులని పరిగెట్టించేది, కోలెస్టరాల్‌ని కత్తిరించేది, కేన్సర్ ను నిరోధించేది.. రక్తపు పోటుని నివారించేది.. వీర్యాన్ని వృద్ధి చేసేది,  తామరని తగ్గించేది, జీర్ణశక్తిని పెంచేది,  ఇలా శరీరంలోని ఇంకా వ్యాధులకు చెక్అ పెట్టె శక్తి వెల్లుల్లికి ఉంది. ఇక ఆస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు వెల్లుల్లి దివ్య ఔషధ. మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది. వెల్లుల్లి మొత్తం శరీరంలోని 22 రాగాల వ్యాధులనుంచి రక్షణ ఇస్తుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న నమ్మకం. అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. వెల్లుల్లిలో అనేక పోష‌కాలు ఉంటాయి. ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వెల్లుల్లి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వెల్లుల్లిని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

*రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నేరుగా అలాగే నమిలి తిన‌వ‌చ్చు.

* ఉదయాన్ని పరగడుపున వెల్లుల్లి ర‌సం తాగ‌వ‌చ్చు.

*ఇలా కూడా చేయలేమనుకునే వారు వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకుని వాటిని కాల్చి తినవచ్చు.

*పెనం మీద కొంచెం నెయ్యి వేసి.. అందులో వెల్లుల్లి వేయించి తినవచ్చు.

*వెల్లుల్లి కషాయంలా చేసుకుని తాగవచ్చు. ముందుగా వెల్లుల్లి రెబ్బ‌లు 2 తీసుకుని నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని రోజుకు 2 సార్లు క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు.

ఇలా వెల్లుల్లిని ఇదొక రూపంలో తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు నివారింపబడతాయి. హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. బీపీ తగ్గతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ముఖ్యంగా వెల్లుల్లి లివర్లి ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక లివర్ఉ  సమస్యలున్నారు.. వెల్లుల్లి తింటే ఎంతో మంచిది.

వెల్లుల్లిని తిన‌డం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

ఇక వెల్లుల్లి తినలేమనుకునేవారికి.. టాబ్లెట్స్ రూపంలో కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి. వైద్య సూచనలను అనుసరించి ఆ టాబ్లెట్స్ ను ఉద‌యం, సాయంత్రం భోజ‌నం అనంత‌రం ఒక్క‌టి చొప్పున 250 మి.గ్రా. మోతాదులో తీసుకోవాలి.  రోజూ తినే ఆహారంలో వెల్లుల్లిని ఏదొక రూపంలో తీసుకోండి.. ఆరోగ్యంగా జీవించండి.

Also Read: ప్రకృతిని అర్ధం చేసుకుని… పెద్దలు చెప్పిన మూడు నియమాలు..అవి పాటిస్తే..జీవితం సంతోషమయం..