Doorstep Banking: ఎస్‌బీఐ డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌.. ఇంటి వద్దనే రూ.20 వేల వరకు పొందవచ్చు

Doorstep Banking: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన వినియోగదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. కస్టమర్లకు మరిన్ని..

Doorstep Banking: ఎస్‌బీఐ డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌.. ఇంటి వద్దనే రూ.20 వేల వరకు పొందవచ్చు
Follow us
Subhash Goud

|

Updated on: Sep 03, 2021 | 10:41 AM

Doorstep Banking: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన వినియోగదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. కస్టమర్లకు మరిన్ని సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతోంది. ఇక వికలాంగులకు, సీనియర్‌ సిటిజన్స్‌కు అనేక రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సర్వీసులు కూడా ఒకటి. ఇందులో భాగంగా వినియోగదారుడు బ్యాంకుకు వెళ్లకుండానే ఇంటి వద్దనే బ్యాంకు సేవలు పొందవచ్చు.

వినియోగదారులు ఇంటి వద్దనే క్యాష్ విత్‌డ్రాయెల్, డిపాజిట్లు, చెక్ బుక్ వంటి పలు రకాల సేవలు పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల్లో భాగంగా కస్టమర్లు ఒక రోజులో ఇంటి వద్దనే రూ.20 వేలు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. అలాగే డిపాజిట్ కూడా చేయవచ్చు. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

నాన్ ఫైనాన్షియల్ సర్వీసులకు అయితే కస్టమర్లు రూ.60 సర్వీస్ చార్జ్ చెల్లించాలి. దీనికి జీఎస్‌టీ అదనం. అదే ఫైనాన్షియల్ ట్రాన్సా్క్షన్లకు అయితే రూ.100తోపాటు జీఎస్‌టీ వసూలు చేస్తోంది బ్యాంకు. ఈ సదుపాయం బ్రాంచ్‌కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఇల్లు కలిగిన వారికి మాత్రమే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే.. 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు, వికలాంగులుకు మాత్రమే సేవలు ఉపయోగించుకోవచ్చు.

ఈ సేవల కోసం రిజిస్టర్‌..

ఈ డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవలు పొందాలంటే కాల్‌ సెంటర్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవల కోసం రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 1800111103 నెంబర్‌కు కాల్ చేసి లేదంటే వెబ్‌సైట్ ద్వారా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.

ఇవీ కూడా చదవండి:

Telstra: హైదరాబాద్‌ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. భారీ స్థలంలో ఆఫీస్‌ కార్యకలాపాలు..!

Google Pay FD: బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!