Google Pay FD: బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!

Google Pay FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలంటే బ్యాంకులో ఖాతా తీసుకోవడం తప్పనిసరి. తర్వాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. అయితే బ్యాంక్‌ ఖాతా తెరవకుండానే..

Google Pay FD: బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!
Follow us

|

Updated on: Sep 03, 2021 | 8:59 AM

Google Pay FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలంటే బ్యాంకులో ఖాతా తీసుకోవడం తప్పనిసరి. తర్వాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. అయితే బ్యాంక్‌ ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ చేసే సదుపాయం ఉంది.ఈ విధమైన సేవలను పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్‌ చేస్తున్నట్టు ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (SFB) ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్‌డీలపై 6.35 శాతం వరకు వడ్డీ ఉంటుందని పేర్కొంది. రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ గ్యారంటీ ఉంటుందని వివరించింది. ఎలాంటి బ్యాంకు ఖాతా లేకుండా గూగుల్‌ పేలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే ప్రక్రియ రెండు నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు.

వినియోగదారులు గూగుల్‌ పే యాప్‌లో బిజినెస్‌ అండ్‌ బిల్స్‌ విభాగంలో ఈక్విటాస్‌ బ్యాంకును ఎంచుకోవాలి. డిపాజిట్‌ చేయాలనుకున్నవారు మొత్తం, కాల పరిమితి నిర్దేశిస్తూ వ్యక్తిగత కేవైసీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. కాలపరిమితి ముగియక ముందే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను రద్దు చేసుకుంటే అదే రోజు వినియోగదారుకు చెందిన బ్యాంక్‌ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్‌ తెలిపింది.

ఎఫ్‌డీ ఎలా చేయాలి..

ముందుగా గూగుల్‌ పే యాప్‌ను ఓపెన్‌ చేసి బిజినెస్‌ అండ్  బిల్స్‌ కేటగిరిలోకి వెళ్లాలి. అందులో ఈక్విటాస్‌ (SFB) లోగోపై క్లిక్‌ చేయాలి. ఈక్విటాస్‌ బ్యాంకు స్పాట్‌ ద్వారా ఎఫ్‌డీ కోసం మొత్తం కాల వ్యవధిని ఎంచుకోవాలి. మీ వ్యక్తిగత, కేవైసీ వివరాలు (ఆధార్‌, పాన్‌ నెంబర్లు) నమోదు చేయాల్సి ఉంటుంది. గూగుల్‌ పే యూపీఐని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.

కాగా, వివిధ బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఇక చిన్న చిన్న బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ డిపాజిట్ల విషయాలలో బ్యాంకులు అప్పుడప్పుడు వడ్డీ రేట్లను మార్పుస్తూ ఉంటాయి.

ఇవీ కూడా చదవండి:

Petrol Diesel Price: వాహనదారులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. దిగి వస్తున్న పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి