Petrol Diesel Price: వాహనదారులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

Petrol Diesel Price: గత కొన్ని రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్‌ పడింది. రెండు రోజుల కిందట స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌..

Petrol Diesel Price: వాహనదారులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!
Petrol and diesel prices
Follow us

|

Updated on: Sep 03, 2021 | 7:33 AM

Petrol Diesel Price: గత కొన్ని రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్‌ పడింది. రెండు రోజుల కిందట స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. సెప్టెంబర్‌ 1న తగ్గాయి. దేశ వ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌ ధరపై 10 నుంచి 15 పైసలు, లీటర్‌ డీజిల్‌ ధరపై 14 నుంచి 15 పైసలు తగ్గగా, ఇప్పుడు నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా దేశంలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు ఉండకపోగా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు వంద రూపాయలకుపైగా దాటిన పెట్రోల ధరలు వాహనదారుల నడ్డి విరుస్తోంది. సామాన్యులు వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడే రోజులు వచ్చేస్తున్నాయి. ఇక తాజాగా దేశ వ్యాప్తంగా ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

దేశంలో ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:

► దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.34కి చేరగా, డీజిల్‌ రూ. 88.77 వద్ద కొనసాగుతోంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.39 ఉండగా, డీజిల్‌ రూ. 96.33కు చేరింది.

► చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 99.08 గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 93.38 వద్ద కొనసాగుతోంది.

► బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 104.84 కాగా, డీజిల్‌ ధర రూ. 94.34 గా ఉంది.

► కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.72, డీజిల్‌ ధర రూ.91.84.

తెలుగు రాష్ట్రాల్లో ..

► హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.40 ఉండగా, డీజిల్‌ రూ. 96.84 గా ఉంది.

► వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.91 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.38గా ఉంది.

► మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.68గా ఉండగా, డీజిల్ ధర రూ.97.87గా ఉంది.

►రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.78ఉండగా, డీజిల్ ధర రూ.97.20గా ఉంది.

► విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.87గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 98.79 వద్ద కొనసాగుతోంది.

► విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.01 కాగా, డీజిల్‌ రూ. 98.94 గా నమోదైంది.

► కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.21గా ఉండగా, డీజిల్ ధర రూ.98.18గా ఉంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. తాజాగా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. దిగి వస్తున్న పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

SBI Savings Plus Account: ఎస్‌బీఐలో మీ అకౌంట్‌ను ఇలా మార్చండి.. ఎక్కువ బెనిఫిట్స్‌ పొందవచ్చు..

అందాల తార శ్రియ కూతురిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
అందాల తార శ్రియ కూతురిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?