5

SBI Savings Plus Account: ఎస్‌బీఐలో మీ అకౌంట్‌ను ఇలా మార్చండి.. ఎక్కువ బెనిఫిట్స్‌ పొందవచ్చు..

SBI Savings Plus Account: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు గుడ్‌న్యూస్‌. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్..

SBI Savings Plus Account: ఎస్‌బీఐలో మీ అకౌంట్‌ను ఇలా మార్చండి.. ఎక్కువ బెనిఫిట్స్‌ పొందవచ్చు..
State Bank of India
Follow us

|

Updated on: Sep 01, 2021 | 7:57 AM

SBI Savings Plus Account: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు గుడ్‌న్యూస్‌. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ (SBI Saving Plus Account) పేరుతో ఓ కొత్త సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణ అకౌంట్‌తో పోలిస్తే ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్‌ ఎక్కువ. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో ఖాతాదారులు దాచుకునే డబ్బులకు 2.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్‌ ఖాతాదారులు సేవింగ్స్ బ్యాలెన్స్‌పై ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఖాతా మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌కు లింక్ అయి ఉంటుంది. మీ అకౌంట్‌లో మీకు ఇప్పట్లో అవసరం లేని డబ్బులు ఉంటే ఆ మొత్తానికి ఎక్కువ వడ్డీ పొందవచ్చు.

ఆ డబ్బులు ఆటోమెటిక్‌గా టర్మ్ డిపాజిట్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మీకు అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఖాతాలో డబ్బులు ఉన్నన్ని రోజులు సాధారణ వడ్డీ కంటే ఎక్కువ వస్తుంది. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్‌లో రూ.35వేల కన్నా ఎక్కువగా ఉన్న డబ్బులు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోకి వెళ్తాయి. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోకి కనీసం రూ.10వేలు జమ చేయాల్సి ఉంటుంది.

ఉదాహరణకు మీ ఖాతాలో రూ.45వేలు ఉంటే రూ.10వేలు, రూ.50 వేలు ఉంటే రూ.15,000 మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లో జమ అవుతాయి. ఈ మొత్తానికి అధిక వడ్డీ పొందవచ్చు. ఈ అకౌంట్ తీసుకున్నవారికి సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో లభించే ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటి సేవలన్నీ ఉంటాయి. ప్రతీ ఏడాది 25 చెక్స్ ఉన్న చెక్ బుక్ ఉచితంగా లభిస్తుంది.

మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌ అకౌంట్‌పై లోన్ కూడా పొందవచ్చు. ఈ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ అయినా మెయింటైన్ చేయవచ్చు. ఈ అకౌంట్‌కు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటూ ఉండదు. ఏ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో అయినా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఖాతా తీసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే మంచిది. ఈ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. లేదా మీ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.

కాగా, ఎస్‌బీఐ వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుంటుంది. వివిధ స్కీమ్‌లను ప్రవేశపెడుతుంటుంది. అలాగే సీనియర్‌ సిటిజన్స్‌, సామాన్య ప్రజలకు అనేక పథకాలు, డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఇవీ కూడా చదవండి:

September 1: కస్టమర్లు అలర్ట్‌: నేటి నుంచి ఈ నిబంధనలు మారుతున్నాయ్‌.. తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలివే..

బాదుడే.. బాదుడు.. క్రెడిట్‌ కార్డుదారులకు ఆ బ్యాంకు షాకింగ్‌ న్యూస్‌.. సెప్టెంబర్‌ 15 నుంచి కొత్త నిబంధనలు.!