AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాదుడే.. బాదుడు.. క్రెడిట్‌ కార్డుదారులకు ఆ బ్యాంకు షాకింగ్‌ న్యూస్‌.. సెప్టెంబర్‌ 15 నుంచి కొత్త నిబంధనలు.!

Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడే వారికి నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. వాటిని గమనించి వాడుకోవడం మంచిది. లేదంటే ఇబ్బందుల్లో పడే..

బాదుడే.. బాదుడు.. క్రెడిట్‌ కార్డుదారులకు ఆ బ్యాంకు షాకింగ్‌ న్యూస్‌.. సెప్టెంబర్‌ 15 నుంచి కొత్త నిబంధనలు.!
Credit Card
Subhash Goud
|

Updated on: Aug 31, 2021 | 10:27 AM

Share

Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడే వారికి నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. వాటిని గమనించి వాడుకోవడం మంచిది. లేదంటే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇక తాజాగా ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది బ్యాంక్‌ ఆప్‌ బరోడా (Bank Of Baroda). ఈజీ, స్వావలంబన్, సెలక్ట్ క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లకు బ్యాంకు బ్యాడ్‌ న్యూస్‌ వినిపించింది. వీరికి అందిస్తున్న ఆఫర్లు, రివార్డులు ఇతర ప్రయోజనాలను తగ్గించాలని తాజాగా నిర్ణయించింది. ఈ నిర్ణయాలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో దరఖాస్తు చేసుకున్న కస్టమర్లకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డులు అందజేస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా గతంలో ప్రకటించింది. అయితే తర్వాత నెల నుంచి ఇందుకు ఛార్జీలు వర్తిస్తాయని తాజాగా వెల్లడించింది. క్రెడిట్ కార్డులపై ఇతర బ్యాంకులు ఎన్నో ఆఫర్లు అందిస్తున్న తరుణంలో.. బ్యాంకు తాజా నిర్ణయం చాలా మందిని ఆశ్యరానికి గురి చేస్తోంది.

కార్డు రీపేమెంట్ బకాయిలపై క్యాష్‌బ్యాక్ ఉండదు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ, స్వావలంబన్ క్రెడిట్ కార్డుదారులకు.. క్రెడిట్ కార్డు రీపేమెంట్ బకాయిల చెల్లింపులపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్‌ వచ్చేది. ఈ క్యాష్‌బ్యాక్ తదుపరి నెల స్టేట్‌మెంట్‌లో క్రెడిట్ అయ్యేది. ఇక సెప్టెంబర్ 15 నుంచి ఈ ఆఫర్‌ను రద్దు చేస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది.

ఇక రివార్డు పాయింట్లలో కోత విధించనుంది. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ప్రతి లావాదేవీపై బ్యాంకులు రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. ఇలా వచ్చిన రివార్డు పాయింట్లతో ఏదైనా వస్తువును కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేది. క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించే సందర్భంలోనూ వీటిని వాడుకోవచ్చు. ప్రతి రివార్డ్ పాయింట్ రిడమ్షన్ విలువను బ్యాంక్ ఆఫ్ బరోడా 25 పైసలుగా నిర్దేశించింది. అయితే సెప్టెంబర్ 15 నుంచి ఈజీ, స్వావలంబన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రివార్డ్ పాయింట్ విలువ 20 పైసలుగా ఉంటుందని బ్యాంకు పేర్కొంది. ఇందులోనూ కోత విధించింది. ఈ కొత్త రేటు అమల్లోకి రాకముందే కస్టమర్లు పాత రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకొని ప్రయోజనాలు పొందవచ్చు.

బోనస్ రివార్డు ఉపసంహరణ

సెలక్ట్ క్రెడిట్ కార్డు కస్టమర్లు ప్రస్తుతం నెలకు రూ.1,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే ఐదు లావాదేవీలపై బోనస్ రివార్డ్ పాయింట్లను పొందుతున్నారు. ఇది కస్టమర్ల సాధారణ రివార్డు పాయింట్లకు అదనంగా ఉంటుంది. కానీ బోనస్ రివార్డ్ పాయింట్లను బ్యాంకు సెప్టెంబర్ 15 నుంచి ఉపసంహరించుకోనుంది.

ఇక స్టేట్‌మెంట్ ప్రకారం చెల్లించాల్సిన మినిమం అమౌంట్ చెల్లించకపోతే.. బ్యాంక్ అన్ని క్రెడిట్ కార్డులపై ఆలస్య రుసుము వసూలు చేస్తుంది. ఈ లేట్ పేమెంట్ ఛార్జీలను సైతం బ్యాంకు పెంచింది. చెల్లించాల్సిన మొత్తాన్ని బట్టి పెరిగిన ఛార్జీ మారుతుందని ప్రకటించింది. క్రెడిట్ లిమిట్‌ను మించి క్రెడిట్ కార్డు వాడినప్పుడు చెల్లించాల్సిన ఛార్జీలను సైతం బ్యాంక్ ఆఫ్ బరోడా పెంచింది. మొత్తం మీద అన్ని ఛార్జీలు పెంచడమే కాకుండా రివార్డు పాయింట్లను సైతం తగ్గించేందుకు ఈ బ్యాంకు ఇలా ప్రకటిస్తే మిగతా బ్యాంకులు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్‌ కార్డులు తీసుకునేవారు అన్ని విషయాలు తెలుసుకుని తీసుకోవడం బెటర్‌. అలాగే క్రెడిట్‌ కార్డులు తీసుకున్నవారు అన్ని నిబంధనలు పాటిస్తూ చెల్లింపులు జరుపుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.

ఇవీ కూడా చదవండి!

SBI Offer: మీరు హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఈ ఆఫర్‌ ఆగస్టు 31తో ముగియనుంది..!

Bumper Offer: వెరైటీ బంపర్‌ ఆఫర్‌.. ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకే నెల జీతం బోనస్‌.. ఎక్కడో తెలుసా..?