AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bumper Offer: వెరైటీ బంపర్‌ ఆఫర్‌.. ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకే నెల జీతం బోనస్‌.. ఎక్కడో తెలుసా..?

Bumper Offer: ఏ సంస్థల్లో అయినా ఉద్యోగులు అందరికి కంటే బాగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటే జీతం పెంచడమో లేక.. ఏదైన గిఫ్ట్‌లు ఇస్తుంటాయి. అలాగే కొన్ని..

Bumper Offer: వెరైటీ బంపర్‌ ఆఫర్‌.. ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకే నెల జీతం బోనస్‌.. ఎక్కడో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Aug 30, 2021 | 12:25 PM

Share

Bumper Offer: ఏ సంస్థల్లో అయినా ఉద్యోగులు అందరికి కంటే బాగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటే జీతం పెంచడమో లేక.. ఏదైన గిఫ్ట్‌లు ఇస్తుంటాయి. అలాగే కొన్ని సంస్థల్లో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకుంటే బోనస్‌లు తదితరాలు అందిస్తుంది. కానీ ఓ సంస్థ మాత్రం తన ఉద్యోగులకు వెరైటీ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రముఖ ఫైనాన్షియల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెరోదా తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఉద్యోగులు ఫిట్‌గా ఉండడం కోసం సరికోత్త ఛాలెంజ్‌ను విసిరింది. ఛాలెంజ్‌లో భాగంగా ఏడాది కాలంలో లక్ష్యాన్ని చేరుకున్నఉద్యోగులకు ఒక నెల జీతాన్ని బోనస్‌గా అందించనుంది. అంతేకాకుండా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ. 10 లక్షలను ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి రాకతో చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు పరిమితం కావడంతో వారి జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. లాక్‌డౌన్‌ మొదలైనప్పటినుంచి ఉద్యోగులు ఇంటికే పరిమితం కావడంతో శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని కంపెనీ సీఈవో నితిన్‌ కామత్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల జీవన విధానంలో, ఆహార విషయంలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు తెలిపారు.

కాగా, ఫిట్‌గా ఉండేందుకు ఉద్యోగులకు ఈ ఛాలెంజ్‌ను విసిరినట్లు నితిన్‌ కామత్‌ తెలిపారు. కంపెనీ తీసుకొచ్చిన ఛాలెంజ్‌ ద్వారా ఉద్యోగుల జీవనా విధానంలో కచ్చితంగా మార్పులు వస్తాయని నితిన్‌ కామత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి ఒక నెల జీతం బోనస్‌, లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10 లక్షలు అందిస్తామని నితిన్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

ఇవీ కూడా చదవండి:

Post Office Schemes: పోస్టల్‌ శాఖ అందించే ముఖ్య పథకాలు.. ఏ స్కీమ్‌లో ఎంత రాబడి.. ఎంత వడ్డీ రేటు..!

Cheque Rule: మీరు చెక్‌బుక్‌ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త.. నిబంధనలు మారాయి.. లేకపోతే ఇబ్బందులే..