Cheque Rule: మీరు చెక్‌బుక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త.. నిబంధనలు మారాయి.. లేకపోతే ఇబ్బందులే..
Cheque Rule: బ్యాంకుల చెక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెక్ బౌన్స్ అయితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా చెక్ ఇచ్చిన తర్వాత..
Cheque Rule: బ్యాంకుల చెక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెక్ బౌన్స్ అయితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా చెక్ ఇచ్చిన తర్వాత వారు బ్యాంకుకు వెళ్లి చెక్‌ను క్లియరెన్స్ చేసుకునే సమయంలో మీ అకౌంట్లో డబ్బులు లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మీరు బ్యాంక్ చెక్ ఉపయోగించడం, చెక్ ద్వారానే ఎక్కువ చెల్లింపులు నిర్వహిస్తున్నట్లయితే కొన్ని విషయాలు గుర్తించుకోవడం మంచిది. మీరు మీ బ్యాంకు ఖాతాలో కచ్చితంగా చెక్‌కు సరిపడ డబ్బులు ఎప్పటికీ కలిగి ఉండాలి. లేదంటే ఇబ్బందిపడాల్సి రావచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. ఈ చెక్ క్లియరెన్స్ శని, ఆదివారాల్లో కూడా జరగవచ్చు. అందువల్ల బ్యాంకు సెలవులతో పని లేకుండా కచ్చితంగా డబ్బులను ఖాతాలో ఉంచుకోవడం మంచిది. ఒకవేళ మీ అకౌంట్లో ఇలా డబ్బులు కలిగి ఉండకపోతే చెక్ బౌన్స్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో మీరు మళ్లీ ఫైన్ కట్టాల్సి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఆర్‌బీఐ ఈ నెల ప్రారంభం నుంచే ఎన్ఏసీహెచ్ సేవలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ నాచ్ సేవల నిబంధనలు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో చెక్ క్లియరెన్స్ అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటాయి. అయితే సాధారణంగా బ్యాంకు పని దినాల్లో మాత్రమే చెక్ క్లియరెన్స్ అవుతుందని భావించి చాలా మంది తమ ఖాతాల్లో సరిపడ బ్యాలెన్స్ ఉంచడానికి ముందుకు రారు. కానీ నాచ్ సేవలు శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లోనూ లభిస్తాయి.