Petrol Rate Today: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల కొన్ని చోట్ల మాత్రం పెరుగుదల.
Petrol Rate Today: గత కొన్ని రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా స్వల్పంగా ధరలు తగ్గడంతో...
Petrol Rate Today: గత కొన్ని రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా స్వల్పంగా ధరలు తగ్గడంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం కూడా లభించింది. ఇక తాజాగా సోమవారం కూడా దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో పెద్దగా మార్పుల కనిపిచంలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల మాత్రం పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.49 గా ఉండగా, డీజిల్ రూ. 88.92 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.52 కాగా, డీజిల్ రూ. 96.48 గా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.20 గా ఉండగా, డీజిల్ రూ. 93.52 వద్ద కొనసాగుతోంది. * కర్ణాటకల రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 104.98 కాగా, డీజిల్ రూ. 94.34 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 105.54 గా ఉండగా, డీజిల్ రూ. 96.99 గా ఉంది. * ఆదిలాబాద్‌లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 108.18 (ఆదివారం రూ. 107.71)గా ఉండగా, డీజిల్ రూ. 99.45 (ఆదివారం రూ. 99.01)గా ఉంది. * విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.67 గా ఉండగా, డీజిల్ ధర రూ. 98.62 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.73 కాగా, డీజిల్ రూ. 97.70 గా నమోదైంది.
Viral Video: చిరుతను వెంటాడిన కోతుల మంద.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంటే!