AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan for Taliban: తాలిబన్ల రాజ్యం కోసం పాకిస్తాన్ ప్రపంచ యాత్ర.. ప్రత్యామ్నాయంగా ఎదిగిపోవాలనే విశ్వ ప్రయత్నాలు!

తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరైనా సంతోషంగా ఉన్నారు అని చెప్పుకోవాల్సి వస్తే అది పాకిస్థాన్ మాత్రమే. తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల మద్దతు మూటగట్టడానికి.. ప్రత్యేకించి ఇస్లామిక్ దేశాలన్నిటినీ తాలిబన్లకు దగ్గర చేయడానికి చర్యలు ప్రారంభించింది పాకిస్తాన్.

Pakistan for Taliban: తాలిబన్ల రాజ్యం కోసం పాకిస్తాన్ ప్రపంచ యాత్ర.. ప్రత్యామ్నాయంగా ఎదిగిపోవాలనే విశ్వ ప్రయత్నాలు!
Afghanistan Crisis
Follow us
KVD Varma

|

Updated on: Aug 30, 2021 | 9:43 AM

Pakistan for Taliban: తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరైనా సంతోషంగా ఉన్నారు అని చెప్పుకోవాల్సి వస్తే అది పాకిస్థాన్ మాత్రమే. తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల మద్దతు మూటగట్టడానికి.. ప్రత్యేకించి ఇస్లామిక్ దేశాలన్నిటినీ తాలిబన్లకు దగ్గర చేయడానికి చర్యలు ప్రారంభించింది పాకిస్తాన్. ఇందులో భాగంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి అనేక దేశాలకు ప్రత్యేకించి ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలకు వెళ్లారు. ఒక నివేదిక ప్రకారం, తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు గుర్తించాలని, దీని ద్వారా ఇక్కడ తన ప్రభావాన్ని పెంచుకోవాలని పాకిస్తాన్ బలంగా కోరుకుంటోంది. మరోవైపు, భారతదేశంతో సహా చాలా దేశాలు ‘చూడండి..వేచి ఉండండి’ విధానాన్ని అనుసరిస్తున్నారనేది కూడా నిజం. ఆగస్టు 31 తర్వాత, చిత్రాన్ని దౌత్య స్థాయిలో క్లియర్ చేయడం ప్రారంభించవచ్చు. అప్పటికి విదేశీ సైనికులు.. పౌరులందరూ ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు వెళ్ళిపోవడం పూర్తవుతుందని భావన.

షా మహమూద్ ఖురేషి పర్యటన కొనసాగుతోంది

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ఇటీవల తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్‌లో పర్యటించారు. పాకిస్తాన్ వార్తాపత్రిక ‘ది ట్రిబ్యూన్’ లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్లకు అనుకూలంగా తీవ్రంగా లాబీయింగ్ చేస్తోంది. తద్వారా ప్రపంచమంతా కాకపోయినా కనీసం కొన్ని ముఖ్యమైన దేశాల నుండి గుర్తింపు పొందవచ్చు. అయితే, ఇప్పటి వరకు దాని ఫలితాలు వెల్లడి కాలేదు. తాలిబానీ ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా అని పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించలేదు. దీనికి కారణం ప్రపంచ దేశాల పట్ల దానికి ఉన్న భయం అని చెప్పవచ్చు.

కొన్ని పర్యటన ప్రణాళికలు

నివేదికల ప్రకారం.. ఖురేషి, విదేశాంగ మంత్రిత్వ శాఖ త్వరలో మరికొన్ని దేశాలను సంప్రదించాలని యోచిస్తున్నాయి. త్వరలో ఆయన మరికొన్ని దేశాలను సందర్శించవచ్చు. వీటిలో యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలు ఉండవచ్చు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వాదన ప్రకారం ”తాలిబన్లను గుర్తించడం ఉద్దేశ్యం తాలిబన్లు మాత్రమే అక్కడ ప్రభుత్వం నిర్వహించాలి. తాలిబన్లు తమ ప్రభుత్వంలో ఇతర పార్టీలను కూడా చేర్చుకుని , తద్వారా బ్యాలెన్స్ నిర్వహించేలా చూసుకోవాలి. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి మరింత దిగజారిపోదు.”

పాకిస్తాన్ తాలిబన్లతో చర్చలు జరుపుతోంది, మెహమూద్ ఖురేషి ఒక ప్రకటనలో, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ నాయకులతో నిరంతరం టచ్‌లో ఉందని ఒప్పుకున్నారు. ఒకవేళ తాలిబాన్ నుండి సరైన సంకేతాలు అందుకుంటే, వాటిని గుర్తించే విషయాన్ని ప్రపంచం ఖచ్చితంగా పరిశీలిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌ను ఒంటరిగా వదిలేయడం అనే తప్పు చేస్తే, ఫలితం మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా ఉంటుందని ఖురేషి చెబుతున్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా కొన్ని రోజుల క్రితం ప్రపంచం అడిగినట్లు తాలిబన్లు చేస్తున్నారని చెప్పారు. ఇది మహిళలకు మానవ హక్కులను వాగ్దానం చేసింది. ఇమ్రాన్ చాలా మంది మంత్రులు కూడా తాలిబాన్లకు అనుకూలంగా నిరంతరం తమ వాదనలు వినిపిస్తూ ప్రపంచాన్ని తాలిబన్ల వైపు తిప్పాలని చూస్తున్నారు.

Also Read: Afghanistan Crisis: ప్రపంచానికే ముప్పు తెచ్చిన అమెరికా పలాయన వాదం..ఆఫ్ఘన్ లో అమెరికా చేసిన నిర్వాకం ఇదీ!

Afghanistan Crisis: అఫ్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న తాలిబన్ల దాష్టీకాలు.. జానపద కళాకారుడు దారుణ హత్య