Tata Punch: పండగ సీజన్‌లో ఎంట్రీ ఇవ్వనున్న టాటా పంచ్‌.. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మరికొన్ని కార్లు..

Tata Punch: దిగ్గజ కార్ల కంపెనీలు మార్కెట్లో కొత్త కొత్త కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ టాటా మోటార్స్.. ఎస్‌యూవీ..

Tata Punch: పండగ సీజన్‌లో ఎంట్రీ ఇవ్వనున్న టాటా పంచ్‌.. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మరికొన్ని కార్లు..
Follow us
Subhash Goud

|

Updated on: Aug 30, 2021 | 9:07 AM

Tata Punch: దిగ్గజ కార్ల కంపెనీలు మార్కెట్లో కొత్త కొత్త కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ టాటా మోటార్స్.. ఎస్‌యూవీ పంచ్‌ విడుదల కానుంది. గతేడాది ఆటో ఎక్పోలో కంపెనీ ఈ మినీ ఎస్‌యూవీని ప్రదర్శించింది. అప్పటినుంచి ఈ కారు స్పెసిఫికేషన్లు, పేర్లపై ఊహాగాలు వెలువడ్డాయి. దీనికి హెచ్‌బీఎక్స్ లేదా హార్న్‌బిల్ అనే పేరు పెడతారనే లీకులు వచ్చాయి. వీటన్నింటికీ తెరదించుతూ టాటా అధికారిక ప్రకటన వెలువరించింది. దీనికి పంచ్ అనే పేరు పెట్టనున్నట్లు వెల్లడించింది.

అయితే హెచ్‌2ఎక్స్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా పంచ్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వెల్లడించింది. స్పోర్టింగ్‌ డైనమిక్స్‌తో పంచ్‌ను రూపొందింది. ఈ పంచ్ కారును రాబోయే పండుగల సీజన్‌లో విడుదల చేస్తామని తెలిపింది. సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టాటా నుంచి వచ్చిన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ నెక్సాన్‌ కంటే ఇది తక్కువ పరిమాణంలో ఉండనుంది.

టాటా పంచ్‌ స్పెసిఫికేషన్లు..

టాటా నుంచి వచ్చిన ఎస్‌యూవీలలో తొలిసారిగా పంచ్ కార్లలో ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ని (ALFA-ARC) ఉపయోగించారు. ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ద్వారా దీనిని రూపొందించారు. హైవేలపై దూసుకుపోయేలా దీనిని డిజైన్ చేశారు.

ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్‌ కార్లలో కనిపించే 1.2 లీటర్ల ఇంజిన్ ఇందులో కూడా ఉండవచ్చు. గేర్ బాక్స్ చాయిస్ లలో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ఆటోమెటిక్ ఉండే అవకాశం ఉంది. హై వేరియంట్లలో డ్రైవింగ్ మోడ్స్ అందించవచ్చని తెలుస్తోంది.

ఇక టాటా మోడల్ కార్లలో అందించే 7 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ ఇందులో కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎస్‌యూవీ ప్రమాణాలతో, పట్టణాలు, నగరాల్లో ప్రయాణించేందుకు అనువైన చిన్న వాహనంగా దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది. స్పోర్టీ త్రీ స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఆల్ట్రోజ్ నుండి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్ వంటి ఫీచర్లతో రానుంది.

ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా థార్‌కు పోటీగా గూర్ఖా విడుదల అవుతోంది.రాబోయే పండగ సీజన్‌లో ఎస్‌యూవీని మార్కెట్‌లో రిలీజ్‌ చేసేందుకు వీలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే సోషల్‌ మీడియాలో టీజర్‌ వదిలారు. ఆఫ్‌రోడ్‌ రైడ్‌ని ఎంచుకునే వారి అభిరుచులకు తగ్గట్టుగా గూర్ఖా ఎస్‌యూవీని డిజైన్‌ చేసింది ఫోర్స్‌ సంస్థ.

ఏడాది ఆరంభంలో నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఫోర్స్‌ సంస్థ గూర్ఖా వాహనాన్ని ప్రదర్శించింది. ప్రస్తుత సంవత్సరం మూడో క్వార్టర్‌లో వాహనాన్ని మార్కెట్లోకి తెస్తామని వెల్లడించింది. సెప్టెంబరు చివరి నాటికి ఫోర్స్‌ మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు.

గూర్ఖా స్పెషాలిటీస్

ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ హెడ్‌లైట్లను ఉపయోగించారు. ఫోర్‌ వీల్‌ డ్రైవింగ్‌తో వచ్చే ఈ థార్‌ జీప్‌లో త్రీ డోర్, ఫోర్‌ డోర్‌ డిజైన్లు అందుబాటులో ఉంటాయి. రెండో వరుసలో కూడా కెప్టెన్‌ సీట్లను అమర్చే అవకాశం ఉంది. అలాగే ఆఫ్‌రోడ్‌ ఎస్‌యూవీకి తగ్గట్టుగా గ్రిల్స్‌, క్రోమ్‌, బంపర్లను డిజైన్‌ చేశారు. ఆఫ్‌రోడ్‌ స్పెషాలిటీ అయిన టైయిల్‌ గేట్‌ మౌంటెడ్‌ స్పేర్‌ వీల్‌ డిజైన్‌ను కొనసాగిస్తున్నారు. గూర్ఖా పూర్తిగా రగ్గ్‌డ్‌ లుక్‌తో వస్తోంది.

బీఎస్ 4 ఇంజిన్ తో పాటు 2.2లీటర్ల ఆయిల్ బర్నర్‌ను ఏర్పాటు చేశారు. స్టాండర్డ్‌గా 5స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 2.6 లీటర్ల డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. 16 అంగుళాల అల్లోయ్ వీల్స్ ఉండి థిక్ ప్రొఫైల్ టైర్స్ తో కొత్తగా డిజైన్ చేశారు.

ఇక ప్రముఖ వాహన సంస్థ వోక్స్ వాగెన్ టైగన్‌.. సెప్టెంబర్‌ 23న విడుదల కానుంది. ఎస్‌యూవీ హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌లకు పోటీగా వస్తోంది. టైగన్‌ స్కోడాతో సమానమైన ఫీచర్స్‌ను జోడించింది.

ఇవీ కూడా చదవండి:

Charging Stations: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్‌ సమస్యకు చెక్‌..!

Car Loan: కారు రుణాలపై చౌక వడ్డీ రేట్లు.. ఏయే బ్యాంకుల్లో ఎంత శాతం.. పూర్తి వివరాలు..!