- Telugu News Photo Gallery Business photos Ez4EV to soon launch on demand mobile charging stations for electric vehicles
Charging Stations: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఛార్జింగ్ సమస్యకు చెక్..!
Charging Stations: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుండటంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగినట్లుగా పలు వాహన తయారీ ..
Updated on: Aug 29, 2021 | 7:00 PM

Charging Stations: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుండటంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగినట్లుగా పలు వాహన తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నప్పటికీ ఛార్జింగ్ సమస్య కారణంగా కొందరు వెనుకడుగు వేస్తున్నారు.

అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ బ్యాటరీ స్టోరేజీ, ఛార్జర్ డెవలప్ మెంట్ కంపెనీ ఈజెడ్4ఈవీ రాబోయే మూడు నెలల్లో 'ఈజుర్జా' అనే ఆన్ డిమాండ్ మొబైల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఈ నిర్ణయంతో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనదారులను వేధిస్తున్న సమస్య చెక్ పెట్టినట్లయ్యింది. ఈ మొబైల్ ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్లు కస్టమర్లు ఎంచుకున్న ప్రాంతాల వద్ద కంపెనీ ఏర్పాటు చేయనుంది.

వినియోగదారులు మొబైల్ ఏటీఎంలను లొకేట్ చేసినట్లుగా ఈ మొబైల్ స్టేషన్లను గుర్తించగలుగుతారు. మెరుగైన ఈవీ కనెక్టివిటీని అందించడం కొరకు చిన్న పట్టణాల్లో, వివిధ నగరాలు, హైవేల్లో 'ఈజుర్జా' మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఛార్జింగ్ స్టేషన్లు 'ఛార్జింగ్-ఆన్-డిమాండ్' వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఒటీ) పరికరం ఇందులో ఉంటుందని కంపెనీ సీఈఓ సతీందర్ సింగ్ వెల్లడించారు.

ఈ ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇది 100 శాతం కార్బన్ ఉద్గార రహిత శక్తిని ఉపయోగించి రీఛార్జింగ్ చేయడానికి లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు 24 గంటలు పనిచేస్తాయి.





























