Car Loan: కారు రుణాలపై చౌక వడ్డీ రేట్లు.. ఏయే బ్యాంకుల్లో ఎంత శాతం.. పూర్తి వివరాలు..!

Car Loan: ఒకప్పుడు ఉన్నతవర్గాల వారికే కారు ఉండేది. ఇప్పుడు మధ్య తరగతి వారికి కూడా కారు అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో కార్లు కొనుగోలు చేసేవారిలో..

Car Loan: కారు రుణాలపై చౌక వడ్డీ రేట్లు.. ఏయే బ్యాంకుల్లో ఎంత శాతం.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 29, 2021 | 6:32 PM

Car Loan: ఒకప్పుడు ఉన్నత వర్గాల వారికే కారు ఉండేది. ఇప్పుడు మధ్య తరగతి వారికి కూడా కారు అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో కార్లు కొనుగోలు చేసేవారిలో స‌గానికిపైగా మ‌ధ్య, ఎగువ మ‌ధ్యత‌ర‌గ‌తి వ‌ర్గీయులే ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. మధ్య తరగతి వారి ఆదాయ ప్రమాణాలు పెర‌గ‌డంతో కార్ల కొనుగోలు ఎక్కువైంది. ఒక‌ప్పుడు జీవితంలో బాగా స్థిర‌ప‌డితే కానీ కారు కొనుగోలు చేసేవారు కాదు. అలాంటిది ఇంకా వివాహం కాని యువ‌తీ యువ‌కులు కూడా సొంత కార్లకు రైడ‌ర్లు అయిపోతున్నారు. ముగ్గురు, న‌లుగురు ఉండే కుటుంబం సైతం కారు కోనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాయు కాలుష్యంతో ఇబ్బంది ప‌డేవారు సైతం కారు కొనుగోలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే కారు కొనుగోలుకు చాలా బ్యాంకులు రుణాలు అందజేస్తున్నాయి. రుణాలపై తక్కువ వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నాయి. చాలా బ్యాంకులు ధ‌ర‌లో 80-90% వ‌ర‌కు 7 సంవ‌త్సరాల కాల‌ప‌రిమితికి కూడా రుణాలు అంద‌చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఎంపిక చేసిన క‌స్టమ‌ర్లకు ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ డీల్స్‌ను ఆకర్షణీయమైన రేట్లతో ఆఫర్ చేస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌తో స‌హా అగ్రశ్రేణి కార్ల త‌యారీ కంపెనీల దేశీయ అమ్మకాలు ఈ ఏడాది జూలైలో వ‌రుస‌గా 37శాతం, 26 శాతం, 101 శాతం పెరిగాయి. ప‌బ్లిక్‌, షేర్డ్ ట్రాన్స్‌పోర్టేష‌న్‌ను త‌గ్గించ‌డానికి, కొవిడ్ బారిన ప‌డ‌కుండా ఉండ‌టానికి చాలా మంది కారు కొన‌డానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి ఈ అమ్మకాలే నిద‌ర్శనం.

కార్ల అమ్మకాలు పెర‌గ‌డానికి ఇంకో కార‌ణం వ్యక్తిగ‌త రుణాల కంటే కూడా ఈ మోటారు రుణాలు త‌క్కువ వ‌డ్డీ రేట్లకు లభించడం. అందుకే చాలా మంది కారు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మీ వ‌య‌స్సు, ఆదాయం, క్రెడిట్ స్కోర్‌, రుణ మొత్తం మొద‌లైన వాటి ఆధారంగా మీకు వ‌ర్తించే కారు రుణ వ‌డ్డీ రేటు బ్యాంక్ నిర్ణయిస్తుంది. కారు రుణాలు 6.80 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. 18 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల జాబితా ఇలా ఉంది. ప్రతి బ్యాంకు 5 సంవ‌త్సరాల కాలానికి, రూ.10.5 ల‌క్షల రుణం కోసం తీసుకుంటే నెలకు రూ.20 వేలకుపైగా ఈఎంఐ ఉంటే.. ఎంత శాతం వడ్డీ రేట్లు విధిస్తున్నాయో చూద్దాం.

వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు

► పంజాబ్‌ అండ్‌ సింథ్ బ్యాంకు 6.80 శాతం

► ఇండియన్‌ బ్యాంకు – 7.15 శాతం

► సెంట్రల్‌ బ్యాంకు – 7.25 శాతం

►బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా – 7.25 శాతం

► కెనరా బ్యాంకు – 7.30 శాతం

► పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు -7.30 శాతం

► బ్యాంకు ఆఫ్‌ ఇండియా – 7.35 శాతం

► యూనియన్‌ బ్యాంకు -7.40 శాతం

► బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర – 7.40 శాతం

► యాక్సిస్‌ బ్యాంకు – 7.45 శాతం

► ఐడీబీఐ బ్యాంకు – 7.50 శాతం

► ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు -7.55 శాతం

► యూకో బ్యాంకు-7.70 శాతం

► స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా – 7.70 శాతం

► ఐసీఐసీఐ బ్యాంకు – 7.90 శాతం

► కరూర్‌ వైశ్య బ్యాంకు – 7.90 శాతం

► హెచ్‌డీఎఫ్‌సీ -7.95 శాతం

ఇంకో విషయం ఏంటంటే.. మీ రుణ మొత్తం క్రెడిట్‌ స్కోర్‌, చేసే వృత్తి, మీరు ఎంచుకున్న బ్యాంకు ఇతర నిబంధనలు, షరతులపై ఆధారపడి మీకు వర్తించే వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది. మీరు కారుపై రుణం తీసుకున్నప్పుడు ఏ బ్యాంకు నుంచి తీసుకుంటున్నారో ఆ బ్యాంకుకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

Nominee: బ్యాంకు ఖాతా.. వివిధ పథకాల్లో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? నమోదు చేయకపోతే ఏమవుతుంది..?

Business Ideas: మీరు టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా..? లాభం ఎంతో తెలిస్తే షాకవుతారు..

Maruti Suzuki: మీరు కొత్త కారు కొనాల‌నుకుంటున్నారా..? అయితే రుణం పొంద‌డం చాలా సుల‌భం..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే