Fixed Deposit Interest Rates: మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? అధిక వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే
Fixed Deposit Interest Rates: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేసేవారు చాలా మంది ఉంటారు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి మంచి వడ్డీ రేటు వస్తుంటుంది..
Fixed Deposit Interest Rates: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేసేవారు చాలా మంది ఉంటారు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి మంచి వడ్డీ రేటు వస్తుంటుంది. వివిధ బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ బ్యాంకులు స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు అందిస్తున్నాయి. డిపాజిట్ చేసిన కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. అందులో సాధారణ కస్టమర్లకు, సీనియర్ సిటిజన్ల బ్యాంకు అన్వెస్ట్‌మెంట్‌పై ఎఫ్‌డీలపై వివిధ రకాల వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే రెండు, మూడు సంవత్సరాల స్థిర డిపాజిట్లపై కూడా పలు ప్రైవేటు, చిన్న ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డీలు అందిస్తున్నాయి. మీరు బ్యాంకుల్లో స్థిర డిపాజిట్లు చేయాలనుకుంటే ముందుగానే వడ్డీ రేట్లు, ఇతర నిబంధనలు తెలుసుకోవడం మంచిది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కంటే చిన్న బ్యాంకులు మంచి వడ్డీ రేటును అందిస్తున్నాయి. వివిధ కాల వ్యవధిలో అందిస్తున్న వడ్డీ రేట్లను బ్యాంకుల వారీగా సరిపోల్చడం ఎంతో ముఖ్యం.
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 6.75 శాతం నుంచి 7 శాతం వరకు అందిస్తున్నాయి. వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7 నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై 3.25 శాతం నుంచి 6.75 శాతం వరకు వడ్డీని అందింది. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.
అలాగే 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ వినియోగదారులకు 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు అందిస్తోంది.
ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ డిపాజిట్లపై 2.50 శాతం నుంచి 5.50 శాతం వరకు వడ్డీ అందిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ అయిన డిపాజిట్లపై 2.5 శాతం నుంచి 5.50 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది.