Petrol Diesel Price: గుడ్‌న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంత తగ్గిందంటే..
Petrol Diesel Price: గత కొన్ని రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్ పడింది. అయితే ఏడు రోజుల తర్వాత వాహనదారులకు కాస్త..
Petrol Diesel Price: గత కొన్ని రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్ పడింది. అయితే ఏడు రోజుల తర్వాత వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించాయి. నిలకడగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు (సెప్టెంబర్ 1)న తగ్గాయి. దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధరపై 10 నుంచి 15 పైసలు, లీటర్ డీజిల్ ధరపై 14 నుంచి 15 పైసలు తగ్గింది. ఇప్పటి వరకు సెంచరీదాటిన పెట్రోల ధరలు వాహనదారుల నడ్డి విరుస్తోంది. సామాన్యులు వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడే రోజులు వచ్చేస్తున్నాయి. స్వల్పంగా తగ్గిన ఈ ధరలు పెద్దగా ఒరిగేది ఏమిలేదని వాహనదారులు నిరుత్సాహ పరుడుతున్నారు. ఇక తాజాగా దేశ వ్యాప్తంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
► దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.34కి చేరగా, డీజిల్ రూ. 88.77 వద్ద కొనసాగుతోంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.39 ఉండగా, డీజిల్ రూ. 96.33కు చేరింది.
► చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.08 గా ఉండగా, డీజిల్ ధర రూ. 93.38 వద్ద కొనసాగుతోంది.
► బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 104.84 కాగా, డీజిల్ ధర రూ. 94.34 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో .. ► హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.40 ఉండగా, డీజిల్ రూ. 96.84 గా ఉంది.
► వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.91 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.38గా ఉంది.
► మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.68గా ఉండగా, డీజిల్ ధర రూ.97.11గా ఉంది.
►రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.90 ఉండగా, డీజిల్ ధర రూ.97.31గా ఉంది.
► విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 గా ఉండగా, డీజిల్ ధర రూ. 98.61 వద్ద కొనసాగుతోంది.
► విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.14 కాగా, డీజిల్ రూ. 98.06 గా నమోదైంది.
► కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.85గా ఉండగా, డీజిల్ ధర రూ.98.77గా ఉంది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. తాజాగా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.